Raamam Raaghavam: వేణు బాటలో ధనరాజ్‌ దర్శకత్వానికి వేళైంది.! ఫస్ట్ లుక్ రిలీజ్..

|

Jan 25, 2024 | 11:20 AM

బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది హాస్యనటులు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అప్పటివరకు పలు చిత్రాల్లో చిన్న పాత్రలలో కనిపించినా.. ఈ షోతో పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే వెండితెరపై కమెడియన్స్‏గా అలరించిన కొందరు.. దర్శకులుగా కొత్త ప్రయాణం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే జబర్ధస్త్ కమెడియన్ వేణు.. తన డెబ్యూ ఫిల్మ్ 'బలగం'తోనే స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఇక ఈయన దారిలోనే.. ఇప్పుడు మరో కమెడియన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.

బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది హాస్యనటులు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అప్పటివరకు పలు చిత్రాల్లో చిన్న పాత్రలలో కనిపించినా.. ఈ షోతో పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే వెండితెరపై కమెడియన్స్‏గా అలరించిన కొందరు.. దర్శకులుగా కొత్త ప్రయాణం స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే జబర్ధస్త్ కమెడియన్ వేణు.. తన డెబ్యూ ఫిల్మ్ ‘బలగం’తోనే స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఇక ఈయన దారిలోనే.. ఇప్పుడు మరో కమెడియన్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అతడేవరో కాదు అతడే ధనరాజ్. ఇక గతేడాది తాను దర్శకత్వం వహింబచబోతున్న సినిమా గురించి అనౌన్స్ చేసిన ధన్‌రాజ్‌.. తాజాగా తన మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఈ మూవీకి రామం రాఘవం అనే టైటిల్ ఖరారు చేసినట్లు చెప్పారు. అలాగే ఇందులో సముద్రఖని, ధనరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీరిద్దరు ఇందులో తండ్రికొడుకులుగా కనిపించనున్నారని సమాచారం. ఫాదర్ అండ్ సన్ సెంటిమెంట్ ను సరికొత్తగా వెండితెరపై చూపించనున్నట్లు తెలుస్తోంది. విమానం సినిమా దర్శకుడు శివ ప్రసాద్ యానాల ఈ సినిమాకు కథను అందించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్‌ అయిన టైటిల్ పోస్టర్‌… సినిమా పై మంచి బజ్‌ను క్రియేట్‌ చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos