IT Raids: డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో , మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లో ఐటీ దాడులు..
ఈ మధ్య కాలంలో ప్యాన్ ఇండియా సినిమాలకు, పెద్ద స్టార్లతో భారీ సినిమాలకు ప్లాన్ చేసింది మైత్రీ మూవీస్. 2015లో ప్రారంభమైన ఈ సంస్థ శ్రీమంతుడు సినిమాతో మొదటి సినిమా నిర్మించింది. ఇప్పటివరకూ 17 పెద్ద సినిమాలు తీసింది.
ఈ మధ్య కాలంలో ప్యాన్ ఇండియా సినిమాలకు, పెద్ద స్టార్లతో భారీ సినిమాలకు ప్లాన్ చేసింది మైత్రీ మూవీస్. 2015లో ప్రారంభమైన ఈ సంస్థ శ్రీమంతుడు సినిమాతో మొదటి సినిమా నిర్మించింది.ఇప్పటివరకూ 17 పెద్ద సినిమాలు తీసింది.ఇక ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌తో ఒక సినిమా, బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌తో మరోసినిమా తీస్తోంది. ఇంత భారీగా ప్యాన్ ఇండియా మూవీస్ ప్లాన్ చేసిన మైత్రీ మూవీస్‌పై ఐటీ రెయిడ్స్ ఇప్పుడు కాస్త సెన్సేషనల్‌గా మారింది. మైత్రి మూవీస్ సంస్థ కార్యాలయంలో ఐటీ రెయిడ్స్ టాలీవుడ్‌లో సంచలనం రేపింది. సుమారు మూడున్నర గంటలుగా 2 ఐటీ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సంస్థ డైరెక్టర్లు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. అలాగే ఏకకాలంలో డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ సోదాల కోసం ఎంటరయ్యారు ఐటీ అధికారులు. కాగా మైత్రి మూవీస్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2 ది రూల్ కూడా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..