హనుమాన్ సక్సెస్‌తో ఎట్ ప్రజెంట్ ఫుల్ జోష్‌లో ఉన్న ప్రశాంత్ వర్మ జాక్ పాట్ కొట్టారు. ఓ పక్క పాన్ ఇండియా రేంజ్లో జై హనుమాన్ సినిమాను తెరకెక్కిస్తూనే.. మరో పక్క బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్‌ను లైన్లో పెట్టేశారట. జై హనుమాన్ సినిమా తర్వాత మైథలాజికల్ టచ్‌లో ఉండే పీరియాడికల్ డ్రామా స్టోరీని రణ్‌వీర్‌కు చెప్పిన ప్రశాంత్ వర్మ.. మరో ఆలోచన లేకుండా హీరోతో ఒకే చెప్పించుకున్నారట. అంటే ఇక రేపో మాపో.. మన టాలీవుడ్ డైరెక్టర్ బాలీవుడ్‌ను దున్నేయడం పక్కా అన్నట్టేగా..!