Allu Arjun – Pushpa 2: పుష్ప టీంకు కొత్త తలనొప్పి.! ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం నిల్.

|

Feb 01, 2024 | 10:16 AM

చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా ఈ లీకులతో పెద్ద చిక్కొచ్చి పడింది దర్శక నిర్మాతలకు. సినిమా మొదలెట్టిన దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు ఎదో ఒక ఫోటో, వీడియో లీక్ అవుతూనే ఉంటుంది. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసిన కూడా ఈ లీక్ లను ఆపలేకపోతున్నారు చిత్రయూనిట్. ఇప్పుడు పుష్ప 2 సినిమాకు కూడా అదే తలనొప్పి మొదలైంది. సెట్ నుంచి అల్లు అర్జున్‌కు సంబంధించిన మరో పిక్ లీకైంది.

చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా ఈ లీకులతో పెద్ద చిక్కొచ్చి పడింది దర్శక నిర్మాతలకు. సినిమా మొదలెట్టిన దగ్గర నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు ఎదో ఒక ఫోటో, వీడియో లీక్ అవుతూనే ఉంటుంది. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసిన కూడా ఈ లీక్ లను ఆపలేకపోతున్నారు చిత్రయూనిట్. ఇప్పుడు పుష్ప 2 సినిమాకు కూడా అదే తలనొప్పి మొదలైంది. సెట్ నుంచి అల్లు అర్జున్‌కు సంబంధించిన మరో పిక్ లీకైంది. ఇక అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అవవడమే కాదు ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూట్‌తో తెగ బిజీగా ఉన్నారు బన్నీ. పుష్ప మొదటి పార్ట్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. డైరెక్టర్ సుకుమార్.. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. దానికితోడు ఈ మూవీ నుంచి రీసెంట్‌గా రిలీజ్ అయిన పుష్ప2 గంగమ్మ జాతర పోస్టర్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంది.

అల్లు అర్జున్ గంగమ్మ తల్లి వేశంలో కనిపించడం.. అందర్నీ గూస్ బంప్స్ పుట్టించింది. అయితే ఈ గెటప్‌కు సంబంధించిన షూట్ రీసెంట్‌గా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ గెటప్‌కు సంబంధించిన బన్నీ ఫోటోలు నెట్టింట లీక్‌ అయ్యాయి. విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ‘పుష్ప 2’ సెట్స్ నుంచి లీక్స్ జరగకుండా.. ఈ మూవీ యూనిట్ అనేక జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. బన్నీ గంగమ్మ గెటప్‌లో ఉన్న పిక్ లీక్ అవ్వడం మేకర్స్‌ను పరేషాన్ చేస్తోంది. ఫోటో లీక్ చేసిన వారిని కనిపెట్టి.. చట్టరిత్యా చర్చలు తీసుకునే పనిలో ఉందని తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Published on: Feb 01, 2024 10:15 AM