ఏపీ నుంచి ఆఫ్రికా వరకు విస్తరించిన ఐబొమ్మ రవి నెట్ వర్క్
టాలీవుడ్‌కు తీవ్ర నష్టం కలిగించిన ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. కూకట్‌పల్లిలో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన రవి, ఏడేళ్లుగా ఐబొమ్మతో సహా పలు వెబ్‌సైట్లను నడుపుతున్నాడు. ఈడీ రంగంలోకి దిగగా, అతడి నెట్‌వర్క్, ఆన్‌లైన్ బెట్టింగ్ సంబంధాలపై విచారణ జరగనుంది.
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టులో షాక్ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు రవిని వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఐదు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చారు. కొత్త సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాడన్న ఆరోపణలతో ఐబొమ్మ రవిని గత శనివారం కూకట్‌పల్లిలో సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడేళ్లుగా ఐబొమ్మతో పాటు బప్పం, ఐవిన్, ఐరాధా టీవీ వంటి పేర్లతో పలు వెబ్‌సైట్లను నడుపుతున్నాడు రవి. ఇప్పటికే రవి అపార్ట్‌మెంట్‌లో పోలీసులు జరిపిన సోదాల్లో మూడు కోట్ల నగదు, వందల సంఖ్యలో హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Raju Weds Rambai: క్లైమాక్స్ కనెక్ట్ అయితే ఈ సినిమా మీకు నచ్చినట్టే
TOP 9 ET News: ట్రోల్స్ కాదు..దిమ్మతిరిగేలా వ్యూస్ !! పెద్ది సూపర్ రికార్డ్
ప్రేమ మనిషిని చేస్తే.. బ్రేకప్ ‘పైరసీ కింగ్’గా మలిచింది
రూ 7.4 లక్షల నుంచి రూ 60 లక్షల ప్యాకేజ్‌కి .. టెకీ పోస్ట్ వైరల్
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

