రూ. 6 కోట్లు పెడితే..రూ.128 కోట్లు వచ్చాయి ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ

Updated on: Jul 20, 2025 | 7:30 PM

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాలను అందుకుంటాయి. కేవలం రూ. 6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఓ చిత్రం ఏకంగా 128 కోట్లు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ సినిమా మరేదో కాదు.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హమ్ ఆప్కే హై కౌన్. 90వ దశకంలో చిత్రాలు ఎన్నో వచ్చాయి. అయితే, కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని, ఆల్‌ టైమ్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి హిందీతో పాటు ఇతర భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్న మూవీ ‘హమ్‌ ఆప్కే హై కౌన్‌’.

తెలుగులో ‘ప్రేమాలయం’ పేరుతో డబ్ అయ్యింది. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న సల్మాన్‌ కెరీర్‌కు ఊపిరినివ్వడమే కాదు, స్టార్‌ హీరో స్టేటస్‌నూ తెచ్చి పెట్టింది. సూరజ్‌ భరజాత్య దర్శకత్వం, రామ్‌ లక్ష్మణ్‌ పాటలు, రాజశ్రీ ప్రొడక్షన్‌ నిర్మాణ విలువలు సినిమాను ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. సల్మాన్ ఖాన్, మాధురీ దీక్షిత్ జంటగా నటించిన ఈ సినిమా సల్మాన్‌ మార్కెట్‌ను పెంచడమే కాదు, వంద వారాలు ఆడిన సినిమాగానూ రికార్డు సృష్టించింది. 90వ దశకంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా చరిత్రపుటలకెక్కింది. ఫుల్‌ రన్‌టైమ్‌లో రూ.100 కోట్లు గ్రాస్‌ వసూలు సాధించిన తొలి హిందీ చిత్రంగా రికార్డు సృష్టించింది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు కుటుంబమంతా కలిసి ఆటపాటలు ఆడే సంస్కృతి ఈ మూవీ విడుదలైన తర్వాత మరింత ప్రాచుర్యం పొందింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇంజెక్షన్ కోసం 20 కి.మీ నడిచిన 92 ఏళ్ల బామ్మ.. చివరకు

ఆ ఒక్క చేప కోసం.. 300 డ్యామ్‌లు కూల్చేసిన చైనా..

‘త్వరగా రిచ్‌ అవ్వడమెలా?’ చాట్‌జీపీటీ అదిరిపోయే రిప్లయ్‌!

శిశువు చనిపోయిందని ఖననం చేస్తున్న సమయంలో అద్భుతం

ప్రేమ పెళ్లికి శిక్షగా.. పొలం దున్నించారు..