యూట్యూబ్‌ను రగిలిస్తున్న సాయిపల్లవి ఛలో ఛలో సాంగ్
ఛలో.. ఛలో పరుగెత్తు.. ! అంటూ గర్జిస్తున్నాడు రవన్న! దొరోని తలుపుకు తాళంలా.. గడీల ముందు కుక్కల్లా.. ఇంకెంత కాలం మీ బతుకు! అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నాడు.
ఛలో.. ఛలో పరుగెత్తు.. ! అంటూ గర్జిస్తున్నాడు రవన్న! దొరోని తలుపుకు తాళంలా.. గడీల ముందు కుక్కల్లా.. ఇంకెంత కాలం మీ బతుకు! అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నాడు. మారదేలే ఈ దోపిడి దొంగల రాజ్యం మారదులే..! అంటూ గళమెత్తుతున్నాడు. రౌద్రపు శత్రువు దాడిని ఎదిరించే పోరాటం మనదే! అంటూ అభాగ్యుల గుండెల్లో ధైర్యాన్ని నూరి పోస్తున్నాడు. అడుగే పిడుగై రాలేలా.. గుండెల దమ్ము చూపించు అంటూ.. విప్లవ భాష్యాన్ని వినిసిస్తున్నాడు. చీకటి మింగిన సూర్యున్ని తెచ్చి.. తూర్పు కొండను వెలిగించు అంటూ.. వంగిన వీపుల బరువులు దించే విప్లవ గీతాన్ని వినండి అంటూ.. బానిస బతుకుల చెర నుంచి బయట పడడండి అంటూ.. నెత్తురు మరిగేలా.. సత్తువ ఎగిసేలా.. నరాలు బిగిసేలా.. నాడులు తెగేలా.. విప్లవ గీతాన్ని వినిపిస్తున్నాడు. వీరుడిలా రొమ్ము విరిచి అడివికేగండి.. పోరాటంతో
గుండె మంటను చల్లార్చుకోండంటూ.. ఉపదేశిస్తున్నాడు.. సమాజాన్ని ఉద్దరిస్తానంటున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘మమ్మల్ని రాక్షసులుగా చూస్తున్నారు’ కన్నీరు పెట్టుకున్న షారుఖ్