తస్మాత్‌ జాగ్రత్త.. స్టార్ సింగర్ పేరుతో మోసం

|

Oct 16, 2024 | 8:59 PM

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో సైబర్ మోసాల పెరిగిపోతున్నాయి. బెట్టింగ్, ట్రేడింగ్‏లో అధిక లాభాలు వస్తాయని చెప్పి అమాయకులను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అలాగే ఇండస్ట్రీలోని ప్రముఖుల పేర్లు, ఫోటోలతో ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి డబ్బులు కావాలని ఫాలోవర్లకు ఫేక్‌ మెసేజ్‌లు పంపుతున్నారు. ఇప్పటికే చాలా మంది సినీతారల సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అయిన సంగతి తెలిసిందే.

దీనిపై ఎప్పటికప్పుడు తమ అభిమానులను హెచ్చరిస్తున్నారు సెలబ్రెటీలు. మరికొందరు ఒక అడుగు ముందుకేసి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా సింగర్ చిత్ర కూడా తన పేరుతో నెట్టింట జరుగుతున్న మోసాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తన పేరు, ఫొటోతో.. కొంతమంది సోషల్‌మీడియా ద్వారా డబ్బులు కావాలని ఫేక్‌ మెసేజ్‌లు పంపుతున్నారని.. గాయని కెఎస్‌ చిత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక పథకానికి తాను అంబాసిడర్‌గా ఉంటానని, 10,000 రూపాయలు పెట్టుబడిగా పెడితే వారంలోపే 50,000 రూపాయలు వస్తాయని, ఐఫోన్ సహా బహుమతుల కోసం ఎదురుచూడాలని తన పేరుతో సోషల్ మీడియాలో కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

స‌ల్మాన్ తో సాన్నిహిత్యమే.. సిద్ధిఖీ హ‌త్య‌కు దారి తీసిందా ??

ఇక్కడ ఆటో సర్వీస్‌ లాగే.. అక్కడ విమాన సర్వీసులు..

బంగారు సింహాసనంపై.. బొబ్బిలి రాజుగారు.. అద్దాల బీరువాల్లో వారు వాడిన కత్తులు

గర్ల్‌ఫ్రెండ్‌ను లాంగ్‌ డ్రైవ్‌‌కి తీసుకెళ్లాలంటే.. కారు కొట్టేయాలా మావ ??

యోగాసనాలతో నవదుర్గ రూపాలు