Suma Kanakala: స్టేజ్‌పైనే సుమను ముద్దుపెట్టుకున్న హాలీవుడ్ యాక్టర్.. తెలివిగా పంచ్ ఇచ్చిన సుమ.
స్టార్ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సందర్భం ఏదైనా, వేదిక ఎక్కడైనా.. మైక్ పట్టుకుంటే చాలు తన మాటల సవ్వడితో అందరినీ మైమరిపిస్తుంది. స్పాంటేనియస్ గా పంచులు వేయడమే కాదు.. ఎదుటి వాళ్ల పంచల్ కు వెంటనే రివర్స్ కౌంటర్ ఇవ్వడం ఈ యాంకరమ్మ స్టైల్. ఎప్పుడూ కూల్ గా నవ్వుతూ, నవ్విస్తూ ఉండే స్టార్ యాంకర్ సుమకు తాజాగా ఓ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.
స్టార్ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సందర్భం ఏదైనా, వేదిక ఎక్కడైనా.. మైక్ పట్టుకుంటే చాలు తన మాటల సవ్వడితో అందరినీ మైమరిపిస్తుంది. స్పాంటేనియస్ గా పంచులు వేయడమే కాదు.. ఎదుటి వాళ్ల పంచల్ కు వెంటనే రివర్స్ కౌంటర్ ఇవ్వడం ఈ యాంకరమ్మ స్టైల్. ఎప్పుడూ కూల్ గా నవ్వుతూ, నవ్విస్తూ ఉండే స్టార్ యాంకర్ సుమకు తాజాగా ఓ ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. స్టేజ్‌పై ఉన్నట్టుండి ఓ హాలీవుడ్ యాక్టర్ సుమ చేతికి ముద్దు పెట్టుకోవడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
తమిళ స్టార్ హీరో విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం తంగలాన్. ట్యాలెంటెడ్ డైరెక్టర్ పా. రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మాళవికా మోహనన్, పార్వతి తిరువొతు కథానాయికలుగా కనిపించనుండగా, పశుపతి, హాలీవుడ్ నటుడు డానియెల్ కల్టగిరోన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న తంగలాన్ సినిమా ఇండిపెండెన్స్ కానుకగా ఆగష్టు 15న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. విక్రమ్, మాళవిక, దర్శకుడు పా. రంజిత్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా వేడుకలో సందడి చేశారు.
ఇక తంగలాన్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ హాలీవుడ్ నటుడు డేనియల్ కాల్టగిరోన్‌ను స్టేజీపైకి ఆహ్వానించింది సుమ. అతనితో తెలుగులో మాట్లాడించే ప్రయత్నం చేసింది. ఇక చివర్లో కాస్త ఫన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించింది. ఇక్కడ ఉండే అమ్మాయిల్లో సుమనే అందంగా ఉంది అని డేనియల్ తో తెలుగులో అనిపించింది. ఆ లైన్ కరెక్ట్‌గా చెప్పడంతో సంతోషంతో షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది. కానీ డేనియల్.. ఆమె చేతికి ముద్దు పెట్టడంతో సుమ అవాక్కయింది. అయితే ఈ సిట్యుయేషన్ ని కూడా ఎంతో కూల్ గా హ్యాండిల్ చేసింది మన యాంకరమ్మ. ఇతడు మా అన్నయ్యా.. రాఖీ పండగ వస్తుంది కదా.. అన్నయ్య సన్నిధి అంటూ పాట అందుకుంది. దీంతో ఒక్కసారిగా ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. అక్కడ ఉన్న అభిమానులంతా ఒక్కసారిగా అరుపులు కేకలు వేస్తూ హోరెత్తించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.