Hai Nanna: హాయ్ నాన్న..! కలెక్షన్లు ఎలా ఉన్నాయి..? ఓటీటీ మార్కెట్ ఓకేనా

|

Dec 12, 2023 | 9:25 PM

Explainer - Hai Nanna: హాయ్ నాన్న... పిలుపునే సినిమా టైటిల్ గా పెట్టి.. కోట్ల రూపాయిల కనకవర్షం కురిసేలా చేసుకున్నారు నాని. సినిమా టైటిల్... జోష్ తో పాటు హార్ట్ ను కూడా టచ్ చేస్తుంది. అందుకే సెంటిమెంట్ ను జాగ్రత్తగా ట్యాకిల్ చేసి సింగిల్ టేక్ లో టూరింగ్ టాకీసుల్లో కూడా సూపర్ టాక్ వచ్చేలా నాని అదరగొట్టాడు. నాని సినిమా అంటేనే మాంచి కామెడీ ఉంటుంది. అది కూడా టైమింగ్ తో లింక్ అయి ఉంటుంది.

హాయ్ నాన్న… పిలుపునే సినిమా టైటిల్ గా పెట్టి.. కోట్ల రూపాయిల కనకవర్షం కురిసేలా చేసుకున్నారు నాని. సినిమా టైటిల్… జోష్ తో పాటు హార్ట్ ను కూడా టచ్ చేస్తుంది. అందుకే సెంటిమెంట్ ను జాగ్రత్తగా ట్యాకిల్ చేసి సింగిల్ టేక్ లో టూరింగ్ టాకీసుల్లో కూడా సూపర్ టాక్ వచ్చేలా నాని అదరగొట్టాడు. నాని సినిమా అంటేనే మాంచి కామెడీ ఉంటుంది. అది కూడా టైమింగ్ తో లింక్ అయి ఉంటుంది. కానీ హాయ్ నాన్న సినిమాలో సెంటిమెంట్ ను పండించడంతో బాగా వర్కవుట్ అయ్యింది. అందుకే ఇంటా బయటా కలెక్షన్లు వచ్చి పడుతున్నాయి. సినిమా యూనిట్ తో పాటు ఇండస్ట్రీ ఎక్స్ పెక్ట్ చేసినంతగా ఆ కలెక్షన్లు ఉన్నాయా? ఓవర్ సీస్ సంగతేంటి?

సినిమా రిలీజ్ అవ్వకముందు ప్రమోషన్స్ విషయంలో నాని మాంచి దూకుడునే ప్రదర్శించాడు. దీంతో బొమ్మ కూడా అదే రేంజ్ లో ఉంటుందని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. థియేటర్ లో మూవీ చేశాక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయితే వచ్చింది. దీంతో వసూళ్లు కూడా భారీగా ఉంటాయి అనుకున్నారు. కానీ ఇండియాలో తొలి ఐదు రోజుల్లో నెట్ కలెక్షన్లు దాదాపు 27 కోట్ల రూపాయిలు. ఇంకా తొలివారం పూర్తవ్వడానికి కాస్త టైమ్ పడుతుంది. సో ఈ కలెక్షన్ల్ మరో పది కోట్ల రూపాయిల మేరకు పెరిగే ఛాన్సుంటుంది.

తొలి ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్లను చూస్తే.. 44 కోట్ల రూపాయిలు దాటాయి. ఇండియాలో కలెక్షన్లు ఎలా ఉన్నా.. ఓవర్సీస్ లో మాత్రం వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. తొలి ఐదు రోజుల్లో దాదాపు 13 కోట్ల రూపాయిలను కలెక్ట్ చేసింది. నాని సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్లు రావడం శుభసూచకంగానే భావించాలి. ఫ్యామిలీ ఆడియన్స్ లో నానీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారంతా నాని యాక్టింగ్ కు బాగా కనెక్ట్ అవుతారు. అందులోనూ నాని ఈ రేంజ్ లో తండ్రీ కూతురు ఎమోషన్ ని పండించడంతో వాళ్లంతా గుడ్ ఫీల్ తో మూవీని చూశామంటున్నారు. అందుకే దానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఓవర్ సీస్ లో ముఖ్యంగా అమెరికాలో నానీని.. మిలియన్ డాలర్ల హీరో అంటుంటారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..