Sai Pallavi: ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్..

|

Dec 15, 2024 | 6:49 PM

హీరోయిన్ సాయి పల్లవి ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ చందూ మోండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. అలాగే హిందీలో రామాయణ్ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో సీతగా సాయి పల్లవి కనిపించనుండగా.. రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తున్నారు. అలాగే ఇటీవలే అమరన్ సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు.

రామాయణ సినిమా కోసం సాయి పల్లవి ఎన్నో అలవాట్లు మార్చుకున్నారని కోలీవుడ్ లో ఓ మీడియా సంస్థ వార్తలు రాసింది. ఈ సినిమా పూర్తయ్యేవరకు సాయి పల్లవి నాన్ వెజ్ మానేసారని.. బయటి ఫుడ్‌ అస్సలు తినడంలేదని, విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా తన వంటవాళ్లను వెంట తీసుకెళ్తున్నారని వార్తలు నెట్టంట వైరలయ్యాయి. తాజాగా వీటిపై స్పందిస్తూ ట్వీట్ చేసారు సాయి పల్లవి. నిరాధారమైన రూమర్స్ రాస్తే ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కొవాల్సి వస్తుంని హెచ్చరించారు. నా గురించి ఎన్నో రూమర్స్ వచ్చాయి. అలా వచ్చిన ప్రతిసారీ నేను మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే నిజం ఏంటనేది ఆ దేవుడికి తెలుసు. కానీ మౌనంగా ఉండేకొద్దీ రూమర్స్‌ ఎక్కువైపోతున్నాయని, ఇప్పుడు స్పందించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. తన సినిమాల విడుదల, తన ప్రకటనలు, తన కెరీర్ ఇలా తనకు సంబంధించిన ప్రతి విషయంపైన అయినా నిరాధారమైన వార్తలు ప్రచురిస్తే.. అది గుర్తింపు పొందిన ఎంత పెద్ద సంస్థ అయినా సరే తాను చట్టబద్ధమైన యాక్షన్ తీసుకుంటానని సోషల్‌ మీడియా వేదికగా హెచ్చరించారు. ఇన్నాళ్లు సహించానని, ఇకపై ఇలాంటి చెత్త కథనాలను చూసేందుకు సిద్ధంగా లేను అంటూ ట్వీట్ చేసారు సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.