Ruhani Sharma: భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీ శర్మ కామెంట్స్..

|

Dec 08, 2024 | 9:29 PM

డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 చిత్రం ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ఎప్పుడెప్పుడా అంటూ వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూసిన ఈ సినిమా ఇప్పుడు విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతుంది. ఈ చిత్రానికి మొదటి నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. దాదాపు మూడేళ్ల క్రితం వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో పుష్ప 2 పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా విడుదలైన పుష్ప ది రూల్ చిత్రం అడియన్స్ అంచనాలకు మించిపోయిందని.. బన్నీ యాక్టింగ్ మైండ్ బ్లోయింగ్ అని , సుకుమార్ అద్భుతం సృష్టించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ఈ చిత్రంపై రియాక్ట్ అవుతున్నారు. డైరెక్టర్ అట్లీ, హరీష్ శంకర్ తదితరులు పుష్ప 2 చిత్రయూనిట్ ను పొగడ్తలతో ముంచెత్తారు. తాజాగా హీరోయిన్ రుహానీ శర్మ కూడా పుష్ప 2 పై ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.

పుష్ప 2 సినిమా చూసిన తర్వాత తాను ఎలా ఫీల్ అయ్యానో చెప్పడానికి పదాలు దొరకడం లేదంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు రుహానీ. భారతీయ సినిమా హద్దులు దాటటం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఓ ముద్ర వేసిందని చెప్పారు. ఇండియన్ సినిమాను పుష్ప 2 ఆకాశమంత ఎత్తుకు పెంచిందని.. మన సినిమా పుష్ప 2 వల్ల వెలిగి పోవడంతో నటిగా తన హృదయం గర్వంతో ఉప్పొంగిపోతుందని అన్నారు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలకు అర్హులని.. భారతీయ సినిమాలో పుష్ప ఒక విస్ఫోటనమని తన ట్వీట్లో రాసుకొచ్చారు రుహానీ. అంతేకాదు డైరెక్టర్ సుక్కూ క్రియేటివిటీకి తనో పెద్ద అభిమానిని అంటూ తన ట్వీట్లో కోట్ చేశారు. ప్రతి సన్నివేశంలోనూ అల్లు అర్జున్ యాక్టింగ్ అద్భుతం అంటూ కొనియాడారు. స్క్రీన్ పై బన్నీ నటన చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని.. బన్నీ నటనకు అన్ని అవార్డులు రావాల్సిందే. ట్వీట్ చేశారు ఈమె. ప్రస్తుతం ఈమె చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.