Rashmika Mandanna: లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?

|

Dec 19, 2024 | 10:01 AM

జీవితంలో ప్రతీ దశలోనూ తోడుండే భాగస్వామి కావాలన్నారు. ప్రస్తుతం ‘పుష్ప2’ విజయోత్సాహంలో ఉన్న రష్మిక తాజాగా ప్రేమ, రిలేషన్‌ గురించి మాట్లాడారు. తనలాంటి మనస్తత్వం ఉన్న భాగస్వామి కావాలన్నారు. తన జీవితంలోకి రాబోయే లైఫ్ పార్ట్‌నర్‌ ఎలా ఉండాలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన భాగస్వామి తన జీవితంలోని ప్రతీ దశలోను తోడుండాలనీ అన్నివేళలా తనకు భద్రతనివ్వాలని రష్మిక చెప్పుకొచ్చారు.

జీవితంలోని కష్ట సమయంలో తనకు సపోర్ట్‌ చేయాలనీ కచ్చితంగా ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలనీ ఆమె అన్నారు. శ్రద్ధ వహించాలనీ మంచి మనసు ఉండాలనీ ఒకరిపై ఒకరు బాధ్యతగా ఉంటే జీవితమంతా కలిసి ఉండొచ్చు అని తెలిపారు. ఇక ప్రేమ గురించి చెబుతూ.. జీవితంలో ప్రతిఒక్కరికీ తోడు కావాలనీ తన దృష్టిలో ప్రేమలో ఉండడం అంటే భాగస్వామిని కలిగిఉండడమే అనీ చెప్పారు. తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదనీ ఒడిదుడుకుల్లో తమతో ఉండి సపోర్ట్‌ చేసేవారు ఉండాలి అని అన్నారు. ఇక రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో అలరించేందుకు బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె నటించిన ‘పుష్ప 2 ది రూల్‌’ ప్రేక్షకుల ముందుకువచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్లు సాధిస్తోంది. రూ.1500 కోట్లకు చేరువలో ఉంది. అలాగే రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ టీజర్‌ తాజాగా విడుదలైంది. విజయ దేవరకొండ వాయిస్‌ అందించిన ఆ టీజర్‌ అందరినీ ఆకర్షిస్తోంది. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో విభిన్నమైన ప్రేమ కథతో లేడీ ఓరియంటెడ్‌ సినిమాగా రానుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.