Pushpa 3 Update: పుష్ప 3 పై బిగ్ అప్డేట్ ఇచ్చిన రష్మిక.! షూటింగ్ అప్పుడేనా..
నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు ‘పుష్ప ‘ సినిమా చాలా ప్రత్యేకం. ‘పుష్ప’ సినిమాతోనే ఆమె పాన్ ఇండియా ఫేమ్ సంపాదించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకుంది. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమా రాబోతోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ‘పుష్ప 2’ డిసెంబర్ 5న విడుదల కానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉంటోంది.
హీరో, హీరోయిన్లు అల్లు అర్జున్ , రష్మిక మందన్నా కూడా సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే పుష్ప3 పైకి బన్నీ ఫ్యాన్స్ ఫోకస్ వెళ్లింది. అందుకు శ్రీవల్లే కారణం అయింది. ఇటీవల పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే కాస్త ఎమోషనల్ అయింది రష్మిక. ఇదే సందర్భంగా మరో ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది. ‘పుష్ప 3’ని కన్ఫర్మ్ చేసింది. గత ఐదేళ్లుగా రష్మిక మందన్న ‘పుష్ప’, ‘పుష్ప 2’ సినిమాల షూటింగ్‌లో పాల్గొంటోంది. దీంతో ఈ టీమ్‌తో మంచి అనుబంధాన్ని పెంచుకుందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే షూటింగ్ అయిపోయిందంటే చాలా బాధగా ఉందంటూ భావోద్వేగానికి లోనైంది. అదే సమయంలో ‘పుష్ప 3’ గురించి హింట్ కూడా ఇచ్చింది. అఫ్ కోర్స్ ఇంకా చాలా పనులు చేయాల్సి ఉందని.. బహుశా పార్ట్ 3 కూడా ఉంటుందని రష్మిక మందన్న రివీల్ చేసింది. ఇది విన్న అభిమానులు పుష్ప3 కూడా ఉందని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ సినిమా మరో రేంజ్‌లో ఉంటుందంటూ అప్పుడే ఊహాగానాలు చేయడం మొదలుపెట్టారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.