Pooja Hegde – Samantha: బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్.. సమంత ప్లేస్‌ను కొట్టేసిందిగా..!
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన పూజా హెగ్డే ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. రాధేశ్యామ్, ఆచార్య డిజాస్టర్స్ తర్వాత తెలుగులో ఈ అందాల తారకు ఆఫర్స్ తగ్గిపోయాయి. ఆ తర్వాత గుంటూరు కారం సినిమా నుంచి కూడా తప్పుకొని బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. కానీ అక్కడ కూడా పూజాకి నిరాశ తప్పలేదు. చాలా రోజులుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీంతో ఇక పూజా కెరీర్ క్లోజ్ అయ్యిందంటూ ప్రచారం నడిచింది.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన పూజా హెగ్డే ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. రాధేశ్యామ్, ఆచార్య డిజాస్టర్స్ తర్వాత తెలుగులో ఈ అందాల తారకు ఆఫర్స్ తగ్గిపోయాయి. ఆ తర్వాత గుంటూరు కారం సినిమా నుంచి కూడా తప్పుకొని బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. కానీ అక్కడ కూడా పూజాకి నిరాశ తప్పలేదు. చాలా రోజులుగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. దీంతో ఇక పూజా కెరీర్ క్లోజ్ అయ్యిందంటూ ప్రచారం నడిచింది. అటు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ యాక్టివ్ గా ఉండకపోవడంతో ఆమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం నెట్టింట చక్కర్లు కొట్టింది. అయితే ఈ రూమర్స్ పై పూజా స్పందించలేదు. తాజాగా పూజా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్టబొమ్మ బ్యాక్ అనే టాక్ వినిపిస్తుంది. టాలీవుడ్ లో మళ్లీ పూజాకు ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం పూజా హెగ్డేకు ఓ క్రేజీ ఛాన్స్ వచ్చిందట. డైరెక్టర్ నందినిరెడ్డి దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ ఓ మూవీ చేయనున్నారట. ఈ ప్రాజెక్టులో సమంతను కథానాయికగా ఎంపిక చేశారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం… సమంత స్థానంలోకి పూజాను తీసుకున్నారట. ప్రస్తుతం సామ్ సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట మేకర్స్. ఇక సామ్ స్థానానికి పూజా సరిగ్గా సెట్ అవుతుందని.. అందుకే ఈ ప్రాజెక్ట్ కోసం ఆమెను సంప్రదించారని… ఈ సినిమాకు పూజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.