Kajal Aggarwal: క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ అవతారం.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!
టాలీవుడ్ చందమామ సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు చూపిస్తోంది. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ఇప్పుడు సినిమాల స్పీడ్ పెంచింది. ఓ వైపు కమర్షియల్ మూవీస్ లో నటిస్తూనే మరో వైపు లేడి ఓరియెంటెడ్ మూవీ కూడా చేస్తుంది. పెళ్లయ్యాక సినిమాలు తగ్గిస్తుందని అంతా అనుకున్నారు కానీ.. కాజల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఆమె నటించిన 'సత్యభామ మూవీ' తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్ చందమామ సెకండ్ ఇన్నింగ్స్ లో జోరు చూపిస్తోంది. భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్.. ఇప్పుడు సినిమాల స్పీడ్ పెంచింది. ఓ వైపు కమర్షియల్ మూవీస్ లో నటిస్తూనే మరో వైపు లేడి ఓరియెంటెడ్ మూవీ కూడా చేస్తుంది. పెళ్లయ్యాక సినిమాలు తగ్గిస్తుందని అంతా అనుకున్నారు కానీ.. కాజల్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఆమె నటించిన ‘సత్యభామ మూవీ’ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మూవీ టీమ్ నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది . దానితో పాటే టీజర్ కూడా రిలీజైంది. ‘సత్యభామ’ సినిమాలో కాజల్ అగర్వాల్ గతంలో కంటే భిన్నంగా కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఇప్పుడు విడుదలైన టీజర్‌లో తుపాకీతో సందడి చేసింది. కాజల్ ను చూడగానే అభిమానులు వావ్ అంటున్నారు. ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. సత్యభామ’ సినిమా విడుదల తేదీని టీజర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా మే 17న విడుదల కానుంది.
ఈ చిత్రాన్ని ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఏసీపీ సత్యభామ పాత్రను పోషించింది. విశేషమేమిటంటే.. ఈ టీజర్‌ను షేర్ చేసిన నిర్మాత కాజల్‌కి టైటిల్‌ని పెట్టారు. కాజల్‌ని ‘క్వీన్ ఆఫ్ మాస్’ అని రాసుకొచ్చారు. ఈ టైటిల్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది కాకుండా కాజల్ అగర్వాల్ ‘ఇండియన్ 2’ సినిమాలో కూడా నటించింది. ఈ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మొత్తానికి కాజల్ అభిమానులు ‘సత్యభామ’, ‘ఇండియన్ 2’ సినిమాల ద్వారా బ్యాక్ టు బ్యాక్ ఎంటర్ టైన్ మెంట్ పొందనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!