Suriya: కూల్‌ ఉండే సూర్యకు.. కోపం తెప్పించిన ప్రభుత్వ విధానం.. వీడియో.

|

Jun 24, 2024 | 7:49 AM

తమిళనాడులో కల్తీసారా తాగి 51 మంది మరణించిన ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు.. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ ఘటనపై తాజాగా తమిళ్ హీరోలు సూర్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం పేరుతో విషాన్ని తాగుతున్నారని.. ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించి కఠిన చట్టాలు చేయాలని కోరాడు. అంతే కాదు.. ఇదే విషయమై తమిళనాడు ప్రభుత్వానికి సోషల్ మీడియా వేదికగా సుధీర్ఘ నోట్ రాశాడు ఈ స్టార్ హీరో.

తమిళనాడులో కల్తీసారా తాగి 51 మంది మరణించిన ఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు.. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ ఘటనపై తాజాగా తమిళ్ హీరోలు సూర్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్యం పేరుతో విషాన్ని తాగుతున్నారని.. ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించి కఠిన చట్టాలు చేయాలని కోరాడు. అంతే కాదు.. ఇదే విషయమై తమిళనాడు ప్రభుత్వానికి సోషల్ మీడియా వేదికగా సుధీర్ఘ నోట్ రాశాడు ఈ స్టార్ హీరో. ఒక చిన్న పట్టణంలో వరుసగా 50 మంది చనిపోవడం తుఫానులు, వర్షాలు, వరదలు వంటి విపత్తుల సమయంలో కూడా జరగని విషాదమని అన్నారు సూర్య. ఇంకా వంద మందికి పైగా ఆస్పత్రిలోనే ఉండడం కలకలం రేపుతోందని లేఖలో రాశారు. వరుస మరణాలు, బాధితుల రోదనలు హృదయాన్ని కలచివేస్తున్నాయని రాసుకొచ్చారు. దీర్ఘకాలిక సమస్యకు స్వల్పకాలిక పరిష్కారం అనేది పనిచేయదన్నారు.

ఇక గతేడాది విల్లుపురం జిల్లాలో మిథనాల్ కలిపిన నకిలీ మద్యం తాగి 22 మంది చనిపోయారని గుర్తు చేశారు. అప్పుడు కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చిందని.. ఈక్రమంలోనే ఇప్పుడు మరో జిల్లాలో కూడా అదే మిథనాల్ కలిపిన కల్తీ మద్యం తాగి ప్రజలు చనిపోయడం దారుణం అని తన లేఖలో కోట్ చేశాడు. ఇప్పటి వరకు ఎలాంటి మార్పు రాకపోవడం చాలా బాధాకరం అన్నాడు. అంతేకాదు అక్రమ మద్యం విక్రయాలను అరికట్టడంలో విఫలమైన పరిపాలనను తీవ్రంగా ఖండిస్తున్నా అన్నాడు సూర్య., మృతులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేస్తూనే.. ఆసుపత్రిలో ఉన్నవారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. దాంతో పాటే ‘ ఇక మీదట కొత్త చట్టం చేద్దాం. మేము దానిని ఎప్పటికీ రక్షిస్తాము’ అంటూ ఓ స్లోగన్‌ను తన లేఖ చివర్లో రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.