Adi Reddy – Geetu Royal: తోడు దొంగలు.. ఇప్పుడు కూడా మారకుంటే ఎలా.? ఆదిరెడ్డి-గీతూపై ఫైర్.
బిగ్ బాస్ సీజన్స్ అన్నింట్లో... బిగ్ బాస్ 6 వేరయా అంటూరు.. బిగ్ బాస్ లవర్స్. ఎందుకంటే ఆ సీజన్లో గీతూ రాయల్.. పర్పార్మెన్స్ అలా ఉంటుంది కనుక. తన తీరుతో.. దెబ్బకే బిగ్ బాస్‌నే అప్పట్లో బిత్తర పోయేలా చేసింది ఈవిడే కనుక. ఇక బిగ్ బాస్ సీజన్6 హౌస్‌లోకి ఎంటర్ అయిన గీతూ రాయల్.. తన గేమ్ ఫ్లాన్ కారణంగా మధ్యలోనే ఎలిమినేట్ అయింది. అందరితో గొడవలు పెట్టుకుంది. కానీ కామన్ మ్యాన్ ఆది రెడ్డితో దోస్తాన్ మాత్రం బానే చేసింది.
బిగ్ బాస్ సీజన్స్ అన్నింట్లో.. బిగ్ బాస్ 6 వేరయా అంటూరు.. బిగ్ బాస్ లవర్స్. ఎందుకంటే ఆ సీజన్లో గీతూ రాయల్.. పర్పార్మెన్స్ అలా ఉంటుంది కనుక. తన తీరుతో.. దెబ్బకే బిగ్ బాస్‌నే అప్పట్లో బిత్తర పోయేలా చేసింది ఈవిడే కనుక. ఇక బిగ్ బాస్ సీజన్6 హౌస్‌లోకి ఎంటర్ అయిన గీతూ రాయల్.. తన గేమ్ ఫ్లాన్ కారణంగా మధ్యలోనే ఎలిమినేట్ అయింది. అందరితో గొడవలు పెట్టుకుంది. కానీ కామన్ మ్యాన్ ఆది రెడ్డితో దోస్తాన్ మాత్రం బానే చేసింది. గీతూ గడుసు తనానికి.. జిత్తుల మారి వేశాలకు.. ఆది రెడ్డి ఆలోచనకు.. అనాలిసిస్‌కు.. వీరిద్దరూ కలిసి ఆడితే.. గేమ్‌లో ఈజీగా ముందుకు పోతరనే నమ్మకం కూడా.. బీబీ లవర్స్‌లో కలిగింది. కానీ కట్ చేస్తే.. ఆదితో కూడా పెట్టుకుని.. గీతూ నెగెటివిటీని మూట గట్టుకుంది. చివరికి జనాల ఓట్ల కారణంగా బయటికి వచ్చింది.
అయితే అలా బయటికి వచ్చిన ఈమె.. ఇప్పుడు మరో సారి చేసింది. హౌస్‌లో తన బెస్ట్ అయిన ఆది రెడ్డికి ఓ సాయం చేసింది. బిగ్ బాస్ రివ్యూవర్‌గా.. బిగ్ బాస్ సీజన్ 7 చేస్తున్న ఆదికి.. ఎవరు ఎలిమినేట్ అవుతారో ముందే చెప్పేస్తూ ఉండేది. ఎలిమినేట్ అయిన వారిని తన ఇంటర్వ్యూ చేస్తుంది కనుక.. షో మేకర్స్.. ముందుగానే ఎవరు ఎలిమినేట్ అనేది ఈమెకు చెప్పేవారంట. వాళ్లను ఇంటర్వ్యూలో ఏం అడుగుతావో ప్రిపేర్ కమ్మని చెప్పే వారంట. అయితే ఇలా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనేది తనకు తెలియగానే… సైలెంట్‌గా ఆది రెడ్డికి మెసేజ్ చేసేదట. దాంతో ఆది రెడ్డి.. తన స్టైల్లో అనాలసిస్ చెప్పినట్టకు చెప్పి.. పలానా వారు ఎలిమినేట్ అవుతారంటూ పక్కగా చెప్పేవాడు. అందర్నీ షాక్ అయ్యేలా చేసేవాడు. మరి బదులుగా గీతూ ఆయన నుంచి షోలో ఏ ప్రశ్నలు అడగాలో తెలుసుకునేదట. ఇదే విషయం రీసెంట్‌గా ఈమే చెప్పింది. ఇలా అప్పుడు హౌస్‌లోనే కాదు.. ఇప్పుడు బయట కూడా.. తోడు దొంగలు గానే ఉంటే ఎలా.. మారాలి కదా అనే కామెంట్.. నెట్టింట వస్తోంది మరి!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos