Prasanth Varma – Chiranjeevi: చరిత్రలో నిలిచిపోయే గిఫ్ట్ ఇస్తున్నావన్నా.! చిరు ఒకే అంటే విధ్వంసమే

Updated on: Feb 01, 2024 | 8:57 AM

అంజనా పుత్రుడు.. చలన చిత్ర ధీరుడు...ఆంజనేయుడి పరమ భక్తుడు..! చిరంజీవిగా... ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు పొందినాడు. తాజాగా పద్మ భూషణుడిగా... ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఆయనే కొణిదల శివ శంకర వర ప్రసాదుడు ఉరఫ్‌ మెగాస్టార్ చిరంజీవుడు. ఇప్పుడీయనకే చరిత్రలో నిలిచిపోయే.. చిరస్మరనీయంగా మిగిలిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆంజనేయుడి పరమ భక్తుడైన ఆయనను.. ఆ పాత్రలోనే ఆవిష్కరించే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు.

అంజనా పుత్రుడు.. చలన చిత్ర ధీరుడు…ఆంజనేయుడి పరమ భక్తుడు..! చిరంజీవిగా… ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు పొందినాడు. తాజాగా పద్మ భూషణుడిగా… ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఆయనే కొణిదల శివ శంకర వర ప్రసాదుడు ఉరఫ్‌ మెగాస్టార్ చిరంజీవుడు. ఇప్పుడీయనకే చరిత్రలో నిలిచిపోయే.. చిరస్మరనీయంగా మిగిలిపోయే గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆంజనేయుడి పరమ భక్తుడైన ఆయనను.. ఆ పాత్రలోనే ఆవిష్కరించే ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. ఇదే విషయం తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పి నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్! హనుమాన్ సినిమా సూపర్ డూపర్ హిట్టు తర్వాత జై హనుమాన్‌ అంటూ.. మరో పాన్ ఇండియన్ సినిమాను మొదలెట్టిన ప్రశాంత్ వర్మ.. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని.. హనుమంతుడిగా చూపించాలని అనుకుంటున్నారట. ఇదే విషయంగా ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాట. అయితే ఈ న్యూస్‌ కాస్త.. తెలుగు టూ స్టేట్స్‌తో పాటు.. టాలీవుడ్ ఫిల్మ్ సిటీ.. అండ్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. చిరు హనుమంతుడి పాత్ర చేస్తే.. కన్నుల పండగే అనే టాక్ బయటికి వస్తోంది. చిరుకు చరిత్రలో నిలిచిపోయే గిఫ్ట్ ఇస్తున్నవన్నా అనే కామెంట్‌ కూడా.. ప్రశాంత్ వర్మను ఉద్దేశించి.. మెగా అభిమానుల నోటి నుంచి వస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Published on: Feb 01, 2024 08:40 AM