‘గాడ్ ఫాదర్ చిరుకు నప్పలే’ పరుచూరి షాకింగ్ కామెంట్స్ !!

|

Nov 28, 2022 | 9:11 PM

కాస్త డిలే అయినా.. డీటేల్డ్‌గా ఓ సినిమా ఎలా ఉందో చెప్పేస్తుంటారు స్టార్ రైటర్ పరుచూరి గోపాల కృష్ణ. తన యూట్యూబ్‌ ఛానెల్‌ వేదికగా.. ఒక్కో సినిమాను అనాలిసిస్ చేసి.. సినిమా ఎలా ఉందో..

కాస్త డిలే అయినా.. డీటేల్డ్‌గా ఓ సినిమా ఎలా ఉందో చెప్పేస్తుంటారు స్టార్ రైటర్ పరుచూరి గోపాల కృష్ణ. తన యూట్యూబ్‌ ఛానెల్‌ వేదికగా.. ఒక్కో సినిమాను అనాలిసిస్ చేసి.. సినిమా ఎలా ఉందో.. ఎలా ఉంటే బాగుంటుందో.. ఒకవేళ బాగుంటే ఎందుకు బాగుందో.. అన స్టైల్లో చెబుతుంటారు. ఫిల్మ్ లవర్స్‌కు డీటేల్డ్ రివ్యూ ఇస్తుంటారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరు గాడ్‌ ఫాదర్ సినిమా గురించి కూడా ఓ వీడియో చేశారు పరుచూరి. ఇక ఈ వీడియోలో గాడ్‌ ఫాదర్ చిరుకు నప్పలే అని షాకింగ్ కామెంట్స్ చేశారు. తన మాటలతో నెట్టింట తెగ వైలర్ అవుతున్నారు. “తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యేలా చిన్న చిన్న మార్పులు చేసినప్పటికీ యథాతథంగా లూసీఫర్ కథనే గాడ్ ఫాదర్ చిత్రంగా తెరకెక్కించారు. చెల్లెళ్లకు దూరంగా ఉన్న అన్నయ్య వాళ్ల ప్రేమను ఎలా పొందాడు అనే అంశాన్ని చూపించారు. సమయానుగుణంగా ట్విస్టులను రివీల్ చేస్తూ కథలోకి తీసుకెళ్లారు డైరెక్టర్. ఆయన స్క్రీన్ ప్లేతో ఆడుకున్నారు. మాతృకతో పోలిస్తే తెలుగులో మంచి స్క్రీన్ ప్లే ఉంది. కానీ కథ, కథనం, డైలాగ్స్ పరంగా కాకుండా కేవలం చిరంజీవి బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని కొన్ని విషయాలు వేరేలా ఉంటే మరింత బాగుండేది అనేది నా భావన.. ఈ సినిమాలో మరికొన్ని మార్పులు చేస్తే మరింత బాగుండేది. మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్‏కు ఈ స్లో పేస్ స్టోరీ నప్పలేదు.”

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విధి ఆడిన వింత నాటకంలో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ హీరోయిన్ బలి !!

Auto Ramprasad: ఆటో రాంప్రసాద్‌కు సర్జరీ !! ఏమైందంటే ??

TOP 9 ET News: అఖండ 2 పై అప్డేట్ ఇచ్చిన బాలయ్య | డైరెక్టర్ బుచ్చిబాబుకు.. చెర్రీ బంపర్ ఆఫర్

జూ నుంచి తప్పించుకోబోయిన హిప్పో !! అడ్డుకున్న సెక్యూరిటీగార్డ్‌పై..

ఆ గ్రామంలో ఓటు వెయ్యకపోతే ఫైన్‌ వేస్తారట !! ఎక్కడ అంటే ??

 

Published on: Nov 28, 2022 09:11 PM