మేటర్ లేకుండానే.. సీక్వెల్స్ అనౌన్స్ చేస్తున్నారు.. ఏంటి బాస్ ఇది

Updated on: Jan 07, 2026 | 3:55 PM

కథలో కంటెంట్ ఉందా లేదా కాదు.. ఎండింగ్‌లో టు బి కంటిన్యూడ్ అనే కార్డ్ పడిందా లేదా అని చూసుకుంటున్నారు మేకర్స్. తీరా సినిమా థియేటర్లో బోల్తా కొట్టాక.. అనౌన్స్‌మెంట్ కాస్తా ట్రోల్ మెటీరియల్‌గా మారిపోతుంది. స్కంద నుంచి సైంధవ్ వరకు సీక్వెల్ అని ఊరించి.. సైలెంట్‌గా మాయమైపోయిన సినిమాలెన్నో..? అలా అనౌన్స్‌మెంట్‌తోనే ఆగిపోయిన సీక్వెల్స్ ఏంటో చూద్దామా..?

కథలో కంటెంట్ ఉందా లేదా కాదు.. ఎండింగ్‌లో టు బి కంటిన్యూడ్ అనే కార్డ్ పడిందా లేదా అని చూసుకుంటున్నారు మేకర్స్. తీరా సినిమా థియేటర్లో బోల్తా కొట్టాక.. అనౌన్స్‌మెంట్ కాస్తా ట్రోల్ మెటీరియల్‌గా మారిపోతుంది. స్కంద నుంచి సైంధవ్ వరకు సీక్వెల్ అని ఊరించి.. సైలెంట్‌గా మాయమైపోయిన సినిమాలెన్నో..? అలా అనౌన్స్‌మెంట్‌తోనే ఆగిపోయిన సీక్వెల్స్ ఏంటో చూద్దామా..? ఈ మధ్య కాలంలో సినిమా హిట్టయినా, ఫ్లాపైనా చివర్లో పార్ట్-2 లోడింగ్ అని కార్డు వేయడం ఫ్యాషన్ అయిపోయింది. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప వంటి సినిమాలిచ్చిన స్ఫూర్తితో ప్రతి దర్శకుడు తన సినిమాను ఒక ఫ్రాంచైజీగా మార్చాలని ఆశ పడుతున్నాడు. కానీ అనౌన్స్‌మెంట్స్‌లో కనిపించిన జోష్.. రిజల్ట్‌లో కనబడట్లేదు. భారీ హైప్ ఇచ్చి బాక్సాఫీస్ దెబ్బకి సైలెంట్‌ అయిన సీక్వెల్స్ చాలా ఉన్నాయి. హరిహర వీరమల్లు నుంచి స్కంద వరకు.. సైంధవ్ నుంచి రామారావు ఆన్ డ్యూటీ వరకు.. అన్నీ ఈ కోవలోకే వస్తాయి. సైంధవ్, స్కంద, రామారావు ఆన్ డ్యూటీ, కిక్ 3.. ఇలా చాలా సినిమాలకు సీక్వెల్స్ లీడ్ ఇచ్చారు. కానీ అవి ఇంకా మెటీరియలైజ్ కాలేదు.. అవుతాయన్న నమ్మకం లేదు. తాజాగా కింగ్డమ్ 2 కూడా లేదని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. రవితేజ రాజా ది గ్రేట్, కిక్ 3, రామారావు ఆన్ డ్యూటీ సీక్వెల్స్‌పై క్లారిటీ లేదు. ఇండియన్ 2 డిజాస్టర్ తర్వాత పార్ట్ 3 ముచ్చటే లేదు. హరిహర వీరమల్లు 2 కూడా లేనట్లే. దేవర 2 కూడా సందిగ్గంలోనే ఉంది. ఒక సినిమా స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే సీక్వెల్ తీయాలి తప్ప.. మార్కెటింగ్ కోసం To be continued అని వేస్తే నమ్మే రోజులు పోయాయని ఈ సినిమాలను చూస్తేనే అర్థమవుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Pawan Kalyan: మరో సినిమా అనౌన్స్ చేసిన పవర్ స్టార్.. సర్‌ప్రైజ్ అదిరిందిగా

Sreeleela: ఇప్పటి వరకు నా ఫెయిల్యూర్స్ మాత్రమే చూసారు.. ఇక నుండి నా సక్సెస్ చూస్తారు

బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న బ్యూటీస్

Dhurandhar: ఏ మాత్రం తగ్గని ధురంధర్ హవా.. ఒక్కో రికార్డులు తిరగరాస్తుందిగా

Deepika Padukone: కొత్త టాలెంట్ కోసం దీపికా ప్లానింగ్..