Kaantha OTT: అప్పుడే OTTలోకి కాంతా మూవీ
దుల్కర్ సల్మాన్ 'కాంత' సినిమా నవంబర్ 14న థియేటర్లలో విడుదలై ఓ మోస్తరు విజయం సాధించింది. ఇప్పుడు ఈ పీరియాడికల్ డ్రామా నెట్‌ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ అరంగేట్రం చేయనుంది. డిసెంబర్ 12న దక్షిణాది భాషల్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. 1950ల బ్యాక్‌డ్రాప్‌లో హీరోల క్రియేటివ్ విభేదాలపై కథ నడుస్తుంది. దుల్కర్ నటనకు ప్రశంసలు దక్కాయి.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కాంత.సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేసింది. అలాగే సముద్రఖని, దగ్గుబాటి రానా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో నవంబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది.పాన్ ఇండియా ప్రాజెక్టుగా వచ్చిన ఈ మూవీ కేవలం యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. అయితే ఓ వర్గం ఆడియెన్స్ కు కాంత సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ మూవీకి ఓ మోస్తరు వసూళ్లు వచ్చాయి. ఇప్పుడీ కాంత సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియాట్రిక్ రన్ క్లోజ్ కావడంతో నెలలోపే ఓటీటీ లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో డిసెంబర్ 12న నెట్ ఫ్లిక్స్ లో కాంత సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారని సమాచారం. తెలుగు సహా దక్షిణాది భాషలన్నీ ఆ రోజే అందుబాటులోకి రానున్నాయి. అయితే హిందీ వెర్షన్ మాత్రం 8 వారాల తర్వాతే వస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం రూమర్ మాత్రమే. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. కాంత సినిమా కథ విషయానికి వస్తే.. 1950 బ్యాక్ డ్రాప్‌లో జరిగే కథ ఇది. హీరో, డైరెక్టర్ మధ్య వచ్చే ఇగో క్లాష్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. సినీ పరిశ్రమలో హీరోలు, నటీనటుల క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా వచ్చే సంఘర్షణలను చాలా బాగా చూపించాడు డైరెక్టర్. ముఖ్యంగా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలాగే సముద్రఖని, రానా దగ్గుబాటి నటన కూడా మెప్పించింది. ఓవరాల్ గా సినిమాకు తమిళనాట మంచి రివ్యూలే వచ్చాయి. కానీ ఇతర భాషల్లో మాత్రం అనుకున్న రెస్పాన్స్ రాలేదు. థియేటర్లలో చూడకపోయి ఉంటే ఈ కాంత సినిమాను నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎటు చూసినా నీళ్లే.. శ్రీలంకను ముంచిన వరుణుడు
చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు.. మూడేళ్లుగా రూ. 80 లక్షల పింఛను కోసం నాటకం
Hongkong: అపార్ట్‌మెంట్లలో అగ్నికీలలు పన్నెండు మంది మృతి.. లోపలే చిక్కుకున్న వందలాది మంది
చెవిపోగులు తాకట్టు పెట్టింది.. కట్ చేస్తే కటిక పేదరికం నుండి పెద్ద ధనవంతురాలు అయ్యింది
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

