సురేందర్ రెడ్డి నెక్స్ట్ సినిమాపై కన్ఫ్యూజన్

Edited By: Phani CH

Updated on: Oct 24, 2025 | 8:01 PM

డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఏం చేస్తున్నారు..? ఇప్పుడు ఈయన గురించి ఎందుకు అనుకోవచ్చు కానీ రెండేళ్లుగా సినిమాలేం చేయకుండానే ట్రెండింగ్‌లో ఉంటున్నారీ దర్శకుడు. ఇప్పుడు కూడా 2 క్రేజీ ప్రాజెక్ట్స్‌లో సూరి పేరే ఓ రేంజ్‌లో వినిపిస్తుంది. పైగా ఆ రెండు సెన్సేషనల్ సినిమాలే. మరి ఏంటా సినిమాలు.. అందులో హీరోలెవరు..? సురేందర్ రెడ్డి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు ఇది.

చేసింది తక్కువ సినిమాలే కానీ చేసినవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. రెండేళ్ళ కింద అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ తర్వాత సురేందర్ రెడ్డి మాయమయ్యారు. అది డిజాస్టర్ కావడంతో సూరి కెరీర్‌పై ఎఫెక్ట్ గట్టిగానే పడింది. పవన్ కళ్యాణ్‌తో సినిమా కమిటైనా.. దానిపై కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఏజెంట్ కంటే ముందు సురేందర్ రెడ్డి కెరీర్ గ్రాఫ్ బాగానే ఉంది. చిరంజీవితో సైరా, రామ్ చరణ్‌తో ధృవ, బన్నీతో రేసుగుర్రం, రవితేజతో కిక్, కళ్యాణ్ రామ్‌తో అతనొక్కడే లాంటి సినిమాలు చేసారు ఈ దర్శకుడు. మధ్యలో కిక్ 2, అశోక్, అతిథి, ఊసరవెల్లి లాంటి సినిమాలు నిరాశ పరిచినా కూడా సురేందర్ రెడ్డి మేకింగ్‌పై ఎవరికీ అనుమానాలైతే లేవు. తాజాగా కిక్ హీరో రవితేజతో సురేందర్ రెడ్డి మరో సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ కాంబోపై వార్తలు బానే వస్తున్నాయిప్పుడు. దాంతో పాటు పవన్ కళ్యాణ్ హీరోగా రామ్ తాళ్లూరి నిర్మించబోయే సినిమాకు కూడా సురేందర్ రెడ్డి దర్శకుడు అంటున్నారు. మరి ఈ రెండు సినిమాల్లో దేనివైపు ఈ దర్శకుడి అడుగులు పడతాయో చూడాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

టాక్సిక్ విషయంలో తప్పెక్కడజరుగుతోంది ??

ఉత్త పోస్టర్‌ మాత్రమే అనుకునేరు.. ఆ పోస్టర్‌తోనే కథపై హింట్ ఇచ్చిన డైరెక్టర్

‘నేను విడాకులు తీసుకుంటే వాళ్లు సంబరాలు చేసుకున్నారు’

‘అరడజను’ పిల్లలతో సంతోషంగా ఉండు బావా !! డార్లింగ్‌కు మోహన్‌బాబు బర్త్‌డే విష్

2025 లో నాగుల చవితి ఎప్పుడు.. వివరాల కోసం ఈ వీడియో చూసేయండి