SS Rajamouli: ఇండియన్‌ స్కూల్స్‌ బోర్డ్‌ ఫర్‌ క్రికెట్‌.. గౌరవ అధ్యక్షుడిగా రాజమౌళి.

|

Jul 02, 2023 | 4:12 PM

సంచలనాలకు మారుపేరుగా నిలుస్తూ, ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న ప్రముఖ దర్శకుడు SS రాజమౌళి కొత్త రోల్‌ పోషించేందుకు సిద్ధమవుతున్నారు. సిల్వర్‌ స్క్రీన్‌ కోసం మెగాఫోన్‌ పట్టుకున్న రాజమౌళి ఇప్పుడు బ్యాట్‌ అండ్‌ బాల్‌ అందుకోబోతున్నారు. క్రికెట్‌ రంగంలోకి ఆయన అడుగుపెట్టబోతున్నారు.

సంచలనాలకు మారుపేరుగా నిలుస్తూ, ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న ప్రముఖ దర్శకుడు SS రాజమౌళి కొత్త రోల్‌ పోషించేందుకు సిద్ధమవుతున్నారు. సిల్వర్‌ స్క్రీన్‌ కోసం మెగాఫోన్‌ పట్టుకున్న రాజమౌళి ఇప్పుడు బ్యాట్‌ అండ్‌ బాల్‌ అందుకోబోతున్నారు. క్రికెట్‌ రంగంలోకి ఆయన అడుగుపెట్టబోతున్నారు. అయితే క్రికెటర్‌గా కాదు, క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా రాజమౌళి వ్యవహరించనున్నారు.

గ్రామీణ ప్రాంతాలు, స్కూల్‌ పిల్లల్లో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌ కేంద్రంగా ఏర్పాటైన ఇండియన్‌ స్కూల్స్‌ బోర్డ్ ఫర్‌ క్రికెట్‌ సంస్థ తమ గౌరవ అధ్యక్షుడిగా ప్రముఖ దర్శకుడు SS రాజమౌళిని ఎన్నుకుంది. ఈ సంస్థకు చీఫ్‌ ప్యాట్రన్‌గా బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ వ్యవహరిస్తున్నారు. అలాగే వెటరన్‌ క్రికెటర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కారు ఈ సంస్థకు ప్రధాన సలహాదారు. జూలై 1 ఉదయం హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ హోటల్‌లో నిర్వహించే కార్యక్రమంలో రాజమౌళిని పేరును ISBC ప్రకటించనుంది. గతేడాది నెలకొల్పిన ISBC సంస్థ దేశవ్యాప్తంగా క్రికెట్‌ సంబంధించిన కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తోంది.

ఇండియాలో సినిమా తర్వాత అందరికి ఇష్టమైంది క్రికెట్‌. దానికి SS రాజమౌళి కూడా అతీతుడేమి కాదు. ఇండియా మాజీ కెప్టెన్‌ MS ధోనికి రాజమౌళి వీరాభిమాని. గతంలో అవార్డు ఫంక్షన్‌లో ఇద్దరు కలుసుకున్నారు కూడా. ధోని రిటైర్‌మెంట్‌ ప్రకటించనప్పుడు రాజమౌళి ఎంతో భావోద్వేగానికి గురైన విషయం అందరికీ తెలిసిందే. మీరు మమ్మల్ని అలరించడమే కాదు మమ్మల్నిగర్వపడేలా చేశారని అప్పట్లో రాజమౌళి ట్వీట్‌ చేశారు. ధోని అంటే ఎంత ఇష్టమో ట్విట్టర్‌ వేదికగా రాజమౌళి తెలియజెప్పారు. ఆ ట్వీట్‌ 11 వేల సార్లు రీట్వీట్‌ అయింది. అంతే కాదు ఆ ట్వీట్‌ను 55 వేల మంది లైక్‌ చేశారు.


మరిన్ని వీడియోస్ కోసం:

Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...