Hanuman: స్టార్ హీరోలకు పోటీగా కుర్ర హీరో..! సంక్రాంతి రేసులో హనుమాన్..
చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ సజ్జ హీరోగానూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సమంత నటించిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించిన తేజ.. ఆ తర్వాత హీరోగా మారాడు. జాంబీ రెడ్డి సినిమాతో మంచి విజయాన్ని ఆదుకున్నాడు తేజ. అలాగే అదృష్టం అనే సినిమా చేశాడు. ఇక ఇప్పుడు హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు.
చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజ సజ్జ హీరోగానూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సమంత నటించిన ఓ బేబీ సినిమాలో కీలక పాత్రలో నటించిన తేజ.. ఆ తర్వాత హీరోగా మారాడు. జాంబీ రెడ్డి సినిమాతో మంచి విజయాన్ని ఆదుకున్నాడు తేజ. అలాగే అదృష్టం అనే సినిమా చేశాడు. ఇక ఇప్పుడు హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇండియన్ సూపర్ హీరో హనుమంతుడి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో జాంబీరెడ్డి సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి హనుమాన్ అనే సినిమాతో రాబోతున్నారు.
ఇక ఈ మూవీని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని తెలుస్తోంది. ఈ సంక్రాంతి పండుగను టార్గెట్ చేసి చాలా సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. వీటిలో ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమా రానుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ని జనవరి 12న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే రవితేజ నటిస్తున్న ఈగల్ మూవీ కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ పోటీ తట్టుకొని హనుమాన్ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

