Rashmika ban: ఆమెను బ్యాన్ చేస్తే ‘కే’ పరిశ్రమకే నష్టం.. దర్శకుడి కామెంట్స్ వైరల్..
రష్మికపై బ్యాన్ విధిస్తే.. పరిశ్రమకే నష్టమని దర్శకుడు నాగశేఖర్ అన్నారు. తన తదుపరి చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన రష్మిక వివాదంపై స్పందించారు.
రష్మికపై బ్యాన్ విధిస్తే.. పరిశ్రమకే నష్టమని దర్శకుడు నాగశేఖర్ అన్నారు. తన తదుపరి చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆయన రష్మిక వివాదంపై స్పందించారు. ‘‘ఒకరి నుంచి కృతజ్ఞత కోరుకోవడం మనదే తప్పు. ‘సంజు వెడ్స్ గీత’ చిత్రాన్ని నేను తెరకెక్కించినప్పుడు అందులో కొంతమంది నటీనటులకు అవకాశం ఇచ్చాను. ఇప్పుడు వాళ్లు కెరీర్‌లో పెద్ద స్టార్స్ అయ్యారు. నా సినిమా తర్వాత వాళ్లు నన్ను గుర్తుపెట్టుకుంటారా? లేదా? అనేది పూర్తిగా వాళ్ల వ్యక్తిగతం. నేను దాన్ని పట్టించుకోను. నా తదుపరి సినిమాపైనే ఫోకస్ పెడతా. ఎదుటివాళ్ల నుంచి కృతజ్ఞతాభావాన్ని కోరుకున్నప్పుడే మనం ఎక్కడో ఒకచోట బాధకు లోనవుతాం’’ అని అన్నారు.రష్మికపై కన్నడ పరిశ్రమ బ్యాన్ విధించనుందంటూ వస్తోన్న వార్తలపై స్పందిస్తూ.. ‘‘దాని గురించి నాకు తెలియదు. ఒకవేళ అలా చేస్తే అది ఆ పరిశ్రమకే నష్టం. ఈ విషయాన్ని నేను సపోర్ట్ చేయను’’ అని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..