Janhvi Kapoor – Hi Nanna: హాయ్‌ నాన్న చూసి జాన్వీ ఎమోషనల్.. టీమ్‌కి ప్రత్యేకంగా శుభాభినందనలు

|

Jan 11, 2024 | 11:39 AM

నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. నూతన దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన నాని సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన హాయ్ నాన్న సినిమాలో నాని మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. గత ఏడాది రిలీజ్ అయినఈ సినిమాకు థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యి అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

నేచురల్ స్టార్ నాని నటించిన హాయ్ నాన్న సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. నూతన దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన నాని సినిమాకు మంచి టాక్ వచ్చింది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన హాయ్ నాన్న సినిమాలో నాని మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. గత ఏడాది రిలీజ్ అయినఈ సినిమాకు థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యి అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. హాయ్ నాన్న సినిమా పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. సినీ ప్రముఖులు కూడా ఈసినిమాను మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా నాని సినిమా పై ప్రశంసలు కురిపించింది. ఎమోషనల్ అయింది.

హాయ్ నాన్న సినిమా పై పొగడ్తలు కురిపిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది జాన్వీ. హాయ్ నాన్న సినిమా నా మనసును తాకింది.. దర్శకుడు శౌర్యవ్ టేకింగ్ చాలా బాగుంది అని రాసుకొచ్చింది జాన్వీ. అలాగే మృణాల్ ఠాకూర్ ఆకట్టుకున్నారు. అలానే మరొక్కసారి హీరో నాని తన నటనతో ఆకట్టుకున్నారు. అద్భుత పెర్ఫార్మన్స్ తో మెప్పించారు అని తెలిపారు టీమ్‌కి ప్రత్యేకంగా శుభాభినందనలు అంటూ రాసుకొచ్చింది జాన్వీ. జాన్వీ కపూర్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటిస్తుంది జాన్వీ. కొరటాల శివ ర్శకత్వంలో తారక్ నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దేవర సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos