చేజార్చుకుంటున్న నయన్‌.. ఒడిసి పడుతున్న త్రిష..

|

Jun 07, 2024 | 11:52 AM

నయనతార, త్రిష మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా..? ఈ రేసులో నయన్ కంటే త్రిషనే ఓ అడుగు ముందున్నారా..? లేడీ సూపర్ స్టార్ పెడుతున్న కండీషన్స్ త్రిషకు వరంగా మారుతున్నాయా..? అసలు త్రిష పాజిటివ్స్ ఏంటి..? నయన్ చేస్తున్న తప్పటడుగులేంటి? త్రిష, నయనతార మధ్య ఇష్యూ ఏంటి..? 40 దాటాక త్రిషకు మహర్దశ మొదలైంది. కోవిడ్ ముందు వరకు ఈమెకు అవకాశాల్లేవు.. త్రిషపని అయిపోయింది అనుకున్నారంతా.

నయనతార, త్రిష మధ్య కోల్డ్ వార్ నడుస్తుందా..? ఈ రేసులో నయన్ కంటే త్రిషనే ఓ అడుగు ముందున్నారా..? లేడీ సూపర్ స్టార్ పెడుతున్న కండీషన్స్ త్రిషకు వరంగా మారుతున్నాయా..? అసలు త్రిష పాజిటివ్స్ ఏంటి..? నయన్ చేస్తున్న తప్పటడుగులేంటి? త్రిష, నయనతార మధ్య ఇష్యూ ఏంటి..? 40 దాటాక త్రిషకు మహర్దశ మొదలైంది. కోవిడ్ ముందు వరకు ఈమెకు అవకాశాల్లేవు.. త్రిషపని అయిపోయింది అనుకున్నారంతా. ఓ టైమ్‌లో పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. కానీ ఊహించని విధంగా ఒక్కసారిగా త్రిష రేంజ్ మారిపోయింది. ఒకేసారి పది సినిమాలు చేస్తున్నారు త్రిష. తెలుగులోనూ చిరంజీవితో విశ్వంభరలో జోడీ కడుతున్నారు. ఒక్కో సినిమాకు 6 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు ఈ అందాల తార. విశ్వంభరకు 10 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే టైమ్‌లో నయనతారకు వచ్చే ఛాన్సులు కూడా త్రిషకే వెళ్తున్నాయని తెలుస్తుంది. అందుకు కారణం లేకపోలేదు. నయన్ ప్రమోషన్స్‌కు రాదు.. అంతేకాదు ఆమెతో డేట్స్ ఇష్యూస్ కూడా ఎక్కువే. త్రిష మాత్రం నిర్మాతలు చెప్పినట్లే చేస్తుంటారని పేరుంది. అదే ఈమెకు కలిసొస్తుంది. జవాన్ తర్వాత సౌత్ సినిమాలపై పెద్దగా ఫోకస్ చేయట్లేదు నయనతార. పైగా రెమ్యునరేషన్ విషయంలో అందనంత ఎత్తులో ఉన్నారు. త్రిష ఈ స్థాయిలో బిజీ అవ్వడానికి నయన్ కూడా ఓ కారణమే. లేడీ ఓరియెంటెడ్ వైపే నయన్ చూపులుంటాయి.. కానీ త్రిష రెండూ కవర్ చేస్తున్నారు. పైగా పారితోషికం కాస్త తక్కువే. మొత్తానికి నయనతార మైనస్‌లే త్రిషకు ప్లస్ అవుతున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ !!

మూగజీవుల పట్ల రైతు పెద్ద మనసు.. ఏం చేశాడో చూడండి !!

Aadhar: జూన్‌ 14 తర్వాత వారి ఆధార్‌ పనిచేయదా ??

Donald Trump: ప్రెసిడెంట్‌ పోటీ నుంచి ట్రంప్‌ తప్పుకోవాలి

మూసివేసిన ఆలయాన్ని తెరిపించిన నటుడు.. రియల్‌ హీరో అంటూ ప్రశంసలు