Yogi Adityanath – Rajinikanth: రజనీతో కలిసి ‘జైలర్’ చూడనున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. వీడియో.
రెండో వారంలో అడుగు పెట్టినా కూడా ఏమాత్రం స్లో డౌన్ అవ్వకుండా అన్ని చోట్లా ఎక్స్‌లెంట్ కలెక్షన్స్‌తో హోల్డ్ చేసి పరుగుపెడుతోంది జైలర్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ మూవీ భారత్‌తో పాటు విదేశాల్లోనూ సంచలన రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా విడుదల తర్వాత హిమాలయాలకు వెళ్లిపోయిన రజనీకాంత్ తిరిగొచ్చారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోకు చేరుకున్న ఆయన.. అక్కడి సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను కలిశారు.
రెండో వారంలో అడుగు పెట్టినా కూడా ఏమాత్రం స్లో డౌన్ అవ్వకుండా అన్ని చోట్లా ఎక్స్‌లెంట్ కలెక్షన్స్‌తో హోల్డ్ చేసి పరుగుపెడుతోంది జైలర్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ మూవీ భారత్‌తో పాటు విదేశాల్లోనూ సంచలన రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా విడుదల తర్వాత హిమాలయాలకు వెళ్లిపోయిన రజనీకాంత్ తిరిగొచ్చారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోకు చేరుకున్న ఆయన.. అక్కడి సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను కలిశారు. లక్నో విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. దేవుడి దయవల్ల జైలర్ సినిమా విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సినిమాను యూపీ సీఎం యోగితో కలిసి చూసేందుకే తాను లక్నో వచ్చానని రజనీకాంత్ మీడియాకు తెలిపారు. వీరితో పాటు పలువురు రాష్ట్రమంత్రులు, బీజేపీ నేతలు కూడా ఈ సినిమా చూడబోతున్నారు. దీంతో యూపీలో జైలర్ హవా అర్ధమవుతోంది.
ఇటీవల విడుదలైన రజనీ కొత్త సినిమా జైలర్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.. ఈ సినిమాలోని ‘కావాలయ్యా.. ’ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. జపాన్ లోని రజనీకాంత్ ఫ్యాన్స్ ఈ పాటకు అదిరిపోయే స్టెప్పులేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జపాన్ అంబాసిడర్ కూడా ఈ పాటకు కాలుకదిపిన వీడియో వైరల్ గా మారింది. ఇక, యూపీకి వెళ్లి అక్కడి సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో కలిసి ఈ సినిమా చూడబోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఎప్పుడూ యోగీతో కలిసి సినిమాలు చూడని రజనీ ఈసారి మాత్రం ఈ నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...