Oppenheimer: ఆస్కార్ విన్నింగ్ సినిమా.. తెలుగులో వచ్చిందోచ్‌.!

Oppenheimer: ఆస్కార్ విన్నింగ్ సినిమా.. తెలుగులో వచ్చిందోచ్‌.!

Anil kumar poka

|

Updated on: Mar 26, 2024 | 8:36 AM

హాలీవుడ్ సినిమాలు చూసే తెలుగు సినీ అభిమానులకు గుడ్ న్యూస్. ఇటీవల ఆస్కార్ వేడుకల్లో ఏకంగా 7 అవార్డులు సొంతం చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ ఓపెన్ హైమర్ తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది జులైలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక అణు బాంబు సృష్టికర్త ప్రముఖ శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా చేసుకుని ‘ఓపెన్‌ హైమర్‌’ను తెరకెక్కించారు హాలీవుడ్ మాస్టర్ మైండ్ క్రిస్టోఫర్ నోలన్.

హాలీవుడ్ సినిమాలు చూసే తెలుగు సినీ అభిమానులకు గుడ్ న్యూస్. ఇటీవల ఆస్కార్ వేడుకల్లో ఏకంగా 7 అవార్డులు సొంతం చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ ఓపెన్ హైమర్ తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది జులైలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇక అణు బాంబు సృష్టికర్త ప్రముఖ శాస్త్రవేత్త జె.రాబర్ట్ ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా చేసుకుని ‘ఓపెన్‌ హైమర్‌’ను తెరకెక్కించారు హాలీవుడ్ మాస్టర్ మైండ్ క్రిస్టోఫర్ నోలన్. సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించిన ఓపెన్ హైమర్ సినిమాకు అవార్డుల పంట కూడా పండింది. ఇటీవల జరిగిన 96వ అకాడమీ అవార్డులు ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో మొత్తం ఏడు ఆస్కార్ అవార్డులు ఈ సినిమాకే వచ్చాయి. అంతకు ముందు గోల్గెన్ గోబ్స్, BAFTA వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు ఓపెన్ హైమర్ ను వరించాయి. ఇలా ఎన్నో విశేషాలు కలిగిన ఓపెన్ హైమర్ సినిమా మార్చి 21వ తేదీన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ‘జియోసినిమా’ లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే ముందుగా కేవలం ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. కానీ మార్చి 24 నుంచి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల వెర్షన్‍న్లలో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..