Meena: ‘నా విషయంలో దిగజారి పోతున్నారు’ మీనా ఎమోషనల్.! వీడియో.

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ముఖ్యంగా పెళ్లి, రిలేషన్ షిప్, బాయ్ ఫ్రెండ్.. ఇలా హీరోయిన్ల పర్సనల్ లైఫ్ విషయాలపై ఎన్నో రూమర్లు పుట్టుకొస్తుంటాయి. అలా ఈ మధ్యన ప్రముఖ నటి మీనా వ్యక్తిగత జీవితం గురించి నెట్టింట పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె రెండో పెళ్లి చేసుకోనుందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.

Meena: 'నా విషయంలో దిగజారి పోతున్నారు' మీనా ఎమోషనల్.! వీడియో.

|

Updated on: Mar 26, 2024 | 9:22 AM

సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని పుకార్లు షికార్లు చేస్తుంటాయి. ముఖ్యంగా పెళ్లి, రిలేషన్ షిప్, బాయ్ ఫ్రెండ్.. ఇలా హీరోయిన్ల పర్సనల్ లైఫ్ విషయాలపై ఎన్నో రూమర్లు పుట్టుకొస్తుంటాయి. అలా ఈ మధ్యన ప్రముఖ నటి మీనా వ్యక్తిగత జీవితం గురించి నెట్టింట పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె రెండో పెళ్లి చేసుకోనుందంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఇక వీటిపై ఇప్పటికే పలు మార్లు క్లారిటీ ఇచ్చింది మీనా. అయినా నెట్టింట మీనాపై దాడి జరుగుతూనే ఉంది. సుమారు 30 ఏళ్ల పాటు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మీనా ఇప్పుడు స్పెషల్ రోల్స్ తో సందడి చేస్తోంది. అయితే కొన్ని నెలల క్రితం ఈ అందాల తార జీవితంలో ఒక పెను విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త విద్యా సాగర్ హఠాన్మరణం చెందారు. దీంతో మీనా, ఆమె కూతురు నైనా ఒంటరివారైపోయారు. ఇలాంటి సమయంలో వారికి అండగా నిలవాల్సింది పోయి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా స్టార్ హీరో ధనుష్ తో ఆమెను లింక్ చేస్తున్నారు. రెండో పెళ్లి అంటూ నెట్టింట రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. వీటిపై పలుమార్లు స్పందించిన మీనా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా మరోసారి ఇదే విషయంపై స్పందించిందామె.

“డబ్బు కోసం ఏమైనా రాస్తారా? సోషల్‌ మీడియా రోజు రోజుకు మరింత దిగజారిపోతుంది. నిజాలు తెలుసుకుని రాయండి. అది అందరికీ మంచిది. దేశంలో నాలాగే ఒంటరిగా జీవించే మహిళలు చాలామంది ఉన్నారు. మా అమ్మానాన్నలు, కూతురు భవిష్యత్తు గురించి కూడా కొంచెం ఆలోచించండి. ప్రస్తుతానికి రెండో పెళ్లి గురించి ఎటువంటి ఆలోచనలు లేవు. భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో తెలియదు. వాటి గురించి ఇప్పుడు ఎలా చెబుతాను. రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు ఉంటే తప్పకుండా నేనే బహిరంగంగా ప్రకటిస్తాను. అంతవరకు ఇలాంటి పుకార్లను సృష్టించవద్దు.. ఎవరూ పట్టించుకోవద్దు” అని ఆగ్రహం వ్యక్తం చేసింది మీనా. ప్రస్తుతం ఆమె కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Follow us
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ప్రతి నెలా రూ. 5000 చాలు.. అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరులవడం ఖాయం
ప్రతి నెలా రూ. 5000 చాలు.. అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరులవడం ఖాయం
దంచికొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్
దంచికొట్టిన ఢిల్లీ బ్యాటర్లు.. ముంబై ముందు భారీ టార్గెట్
ఏసీబీ వలలో మరో లంచగొండి.. లంచం అడిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి..
ఏసీబీ వలలో మరో లంచగొండి.. లంచం అడిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి..
జామ పండ్లు మాత్రమే కాదు.. జ్యూస్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
జామ పండ్లు మాత్రమే కాదు.. జ్యూస్‌తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
పోలింగ్ బూత్‌లోకి వచ్చిన అనుకోని అతిథి.. జనం పరుగో పరుగు..
పోలింగ్ బూత్‌లోకి వచ్చిన అనుకోని అతిథి.. జనం పరుగో పరుగు..
ఖాతాదారులకు ఆ మూడు బ్యాంకుల షాక్..సర్వీస్ చార్జీలు బాదుడు షురూ..!
ఖాతాదారులకు ఆ మూడు బ్యాంకుల షాక్..సర్వీస్ చార్జీలు బాదుడు షురూ..!
ఏంది బ్రో.. చిన్న విషయానికే ఇంత పని చేశావ్..
ఏంది బ్రో.. చిన్న విషయానికే ఇంత పని చేశావ్..
టీ 20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టేది అతనే: యువరాజ్
టీ 20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టేది అతనే: యువరాజ్
రెండు మిలియన్ వాహనాలను రీకాల్ చేసిన టెస్లా
రెండు మిలియన్ వాహనాలను రీకాల్ చేసిన టెస్లా
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
ఆత్రంగా ఫుడ్ ఆర్డర్‌ను తెరిచింది.. కట్ చేస్తే వచ్చింది చూసి షాక్
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
తెలంగాణలో కరెంట్ కోతలపై కేసీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
'వైసీపీ మేనిఫెస్టోను టీడీపీ కాపీ కొడుతోంది'.. మాజీ మంత్రి పేర్ని
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
విరిగిపడిన కొండచరియలు.. చైనా సరిహద్దులకు రాకపోకలు బంద్.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..
మోహన్ లాల్ ఎఫెక్ట్.! అప్పట్లో చిరు సినిమా డిజాస్టర్..