చిరంజీవికి సర్జరీ.. అందుకే బయటికి రావడం లేదా ?? మెగా డాటర్ క్లారిటీ

Updated on: Jan 09, 2026 | 7:40 PM

చిరంజీవికి సర్జరీ జరిగిందని వస్తున్న పుకార్లపై ఆయన కుమార్తె సుస్మిత స్పందించారు. ఈ వార్తలు అవాస్తవమని, చిరంజీవి సర్జరీ చేయించుకోలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని, త్వరలోనే ప్రమోషన్లలో పాల్గొంటారని తెలిపారు. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి కొత్త లుక్‌లో కనిపించనున్నారని వెల్లడించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఒక విషయం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. చిరంజీవికి సర్జరీ జరిగిందని, అందుకే మన శంకరవర ప్రసాద్ గారు సినిమా ప్రమోషన్లకు ఆయన దూరంగా ఉన్నారనే టాక్ తెగ వినిపిస్తోంది. ఇది మెగా భిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ టాక్ పై చిరు డాటర్ సుస్మిత రియాక్టయ్యారు. అసలు విషయం ఏంటనేది వివరించారు. చిరంజీవి లేటెస్ట్ సినిమా ‘మనశంకర్‌ వరప్రసాద్‌ గారు’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘చిరంజీవి కి సర్జరీ జరిగిందట నిజమేనా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ఆన్సర్ ఇచ్చారు. ‘దీనిపై ఎలా మాట్లాడాలో తెలియడం లేదని.. ప్రస్తుతానికి ఎలాంటి కామెంట్‌ చేయనంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే మరో విలేకరి.. సుస్మితను మరో ప్రశ్న అడిగాడు.’సర్జరీ కారణంగానే చిరంజీవి ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నారట కదా?’ అంటూ మెగా డాటర్‌ను అడిగాడు. దీంతో ఆమె.. అలాంటిదేమి లేదని.. పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనుల్లో బిజీగా ఉన్నారని క్లారిటీ ఇచ్చారు సుస్మిత. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌తో పాటు, సినిమా ప్రమోషన్స్‌, ఇంటర్వ్యూలకు చిరంజీవి, వెంకటేశ్‌ ఇద్దరూ వస్తారని అన్నారు. అంతేకాదు చిరంజీవి ప్రస్తుతం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనిలో బిజీగా ఉండడంతో పాటు.. ఓవర్సీస్‌ అభిమానులతో వీడియో కాల్స్‌లో ముచ్చటిస్తున్నారంటూ మెగా డాటర్ చెప్పుకొచ్చారు. గతంతో పోలిస్తే ఆయన ఫిట్‌నెస్‌ పై బాగా దృష్టి సారించారని.. అందుకే స్క్రీన్‌పై స్పెషల్ లుక్‌లో కనిపిస్తున్నారని అన్నారు ఆమె.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

iBomma Ravi: ఐబొమ్మ రవికి బొమ్మ చూపించిన నాంపల్లి కోర్ట్‌

టెన్త్‌ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. పరీక్షల కోసం ఉచిత స్నాక్స్

మంచు సునామీ..ఎప్పుడైనా చూశారా..! షాకింగ్‌ వీడియో

పూరి-తిరుపతి రైలులో అగ్నిప్రమాదం

దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు.. ఏపీకి భారీ వర్ష సూచన