Fahadh Faasil: చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?

|

Jun 30, 2024 | 5:10 PM

ఫహాద్ ఫాజిల్..! పుష్ప సినిమాతో .. టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అయిన ఈ స్టార్ యాక్టర్.. తాజాగా చిక్కుల్లో పడ్డారు. కేరళ మానవ హక్కుల సంఘానికి కోసం తెప్పించారు. చివరకికి వారు సుమోటోగా కేసు నమోదు చేసుకుని విచారణ జరిపే వరకు తెచ్చుకున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..! ఫహాద్ ఫాజిల్ ప్రొడ్యూసర్‌గా ప్రస్తుతం పింకేలీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఫహాద్ ఫాజిల్..! పుష్ప సినిమాతో .. టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో పాపులర్ అయిన ఈ స్టార్ యాక్టర్.. తాజాగా చిక్కుల్లో పడ్డారు. కేరళ మానవ హక్కుల సంఘానికి కోసం తెప్పించారు. చివరకికి వారు సుమోటోగా కేసు నమోదు చేసుకుని విచారణ జరిపే వరకు తెచ్చుకున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..! ఫహాద్ ఫాజిల్ ప్రొడ్యూసర్‌గా ప్రస్తుతం పింకేలీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ అంగమలైలోని ఎర్నాకులం ప్రభుత్వ ఆసుపత్రిలో చిత్రీకరించారు. అయితే ఆసుప్రతిలో రాత్రుళ్లు షూటింగ్ జరపడంతో.. అక్కడున్న రోగులు చాలా ఇబ్బందులు పడినట్లు తెలుస్తోంది. ఎమర్జెన్సీ రూంలోనూ షూటింగ్ చేయడంతోపాటు లోపలికి ఎవరినీ అనుమతించలేదని తెలుస్తోంది. అంతేకాదు అత్యవసర చికిత్స అవసరం ఉన్నప్పటికీ పలువురు రోగులను ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లనీయకుండా చిత్రయూనిట్ అడ్డుకున్నారని.. ఆసుపత్రిలో రాత్రంతా నానా హంగామా చేశారని అక్కడున్న రోగులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలను ఖండించింది నిర్మాతల సంఘం. ఆసుపత్రిలో షూటింగ్ కోసం రూ.10 వేలు చెల్లించామని తెలిపింది. అయితే ఈ ఘటనపై కేరళ మానవ హక్కుల సంఘం నిర్మాత ఫహాద్ ఫాజిల్ పై కేసు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఫహాద్ స్పందించలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.