Brahmanandam: ఈ నవ్వుల రేడు ఈసారి ఏడిపించేశాడురా.! నెట్టింట ట్రేండింగ్ వీడియో.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది గొప్ప నటుల్లో బ్రహ్మానందం ఒకరు. కన్నెగంటి బ్రహ్మానందం కమెడియన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించి ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్నారు. తనదైన కామెడీ టైమింగ్ తో పాటు.. చిత్రవిచిత్ర హావభావాలు పలికిస్తూ నవ్వులు పూయించారు. ఆహా నా పెళ్ళంట సినిమాతో కెరీర్ ప్రారంభించిన బ్రహ్మానందం.. టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ కింగ్ గా నిలిచారు.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది గొప్ప నటుల్లో బ్రహ్మానందం ఒకరు. కన్నెగంటి బ్రహ్మానందం కమెడియన్ గా ఎన్నో వందల సినిమాల్లో నటించి ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకున్నారు. తనదైన కామెడీ టైమింగ్ తో పాటు.. చిత్రవిచిత్ర హావభావాలు పలికిస్తూ నవ్వులు పూయించారు. ఆహా నా పెళ్ళంట సినిమాతో కెరీర్ ప్రారంభించిన బ్రహ్మానందం.. టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ కింగ్ గా నిలిచారు. ఒకప్పుడు సినిమాలో నవ్వులు పూస్తున్నాయ్ అంటే అక్కడ ఖచ్చితంగా బ్రహ్మానందం ఉన్నాడన్న మాటే! బ్రహ్మానందం అంటే కేవలం కామెడీ మాత్రమే కాదు.. తన నటనతో ప్రేక్షకులకు కన్నీళ్లు కూడా తెపిస్తారు ఈయన. సీరియస్ పాత్రల్లోనూ ఇమిడిపోయి ఆ సీన్స్ ను రక్తికట్టిస్తారు. ఇటీవలే కృష్ణ వంశీ రంగమార్తాండ సినిమాలోనూ అదే చేశారు. హాస్పటిల్‌లో ప్రకాష్ రాజ్తో .. మహా భారతం డైలాగ్ చెప్పి .. తన హావభావాలతో.. సినిమా చచూస్తున్న వారి రోమాలు నిక్కబొడిచేలా చేశాడు. ఇక తాజాగా ఓ వీడియో తాను చేసిన యాక్టింగ్తో అందర్నీ ఏడిపిస్తున్నారు. ఎస్! ఓ వేదికపై బ్రహ్మానందం చేసిన యాక్టింగ్ ఎట్ ప్రజెంట్ నెటిజన్స్ చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. మతిస్థిమితం సరిగ్గా లేని ఓ బాలుడు తండ్రి దగ్గర దెబ్బలు తింటూ సంజాయిషీ ఇస్తున్నట్టు నటించి ఓ ఈవెంట్లో అందర్నీ ఏడిపించారు బ్రహ్మానందం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతున్నారు. ఇలాంటి నటుడుకి ఎన్ని దండాలు పెట్టిన తక్కువే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..