లైంగిక ఆరోపణలు కారణంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అరెస్ట్

Updated on: Oct 28, 2025 | 1:39 PM

ఇటీవల విడుదలైన రష్మిక మందన్న థామా , శ్రద్ధా కపూర్​ స్త్రీ 2 తో సహా అనేక చిత్రాలకు సంగీతం అందించిన సచిన్ - జిగర్‌ ద్వయంలో ఒకరైన సచిన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే సదరు లేడీ ఫిర్యాదు మేరకు ఈ మ్యూజిక్ డైరెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

సచిన్ సంఘ్వీ తనను లైంగికంగా వేధించాడంటూ ఒక యువతి రీసెంట్‌గా సంచలన ఆరోపణలు చేసింది. సచిన్ సంఘ్వీ తనకు సంగీత పరిశ్రమలో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడని, ప్రత్యేక మ్యూజిక్ ఆల్బమ్ విడుదల చేశాడని, తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి లైంగికంగా వేధించాడని ఆ యువతి ఆరోపించింది. ఆరోపించడమే కాదు పోలీస్‌ స్టేషన్లో ఈ మ్యూజిక్ డైరెక్టర్ పై ఫిర్యాదు చేసింది. బాధితురాలు దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, సచిన్ 2024లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆ యువతిని సంప్రదించాడు. కొత్త మ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని సచిన్ చెప్పాడు. అప్పటి నుంచి ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. సచిన్ ఒకసారి ఆ యువతిని తన స్టూడియోకి పిలిపించి అక్కడ లైంగికంగా వేధించాడని యువతి చెబుతోంది. సచిన్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి చాలాసార్లు లైంగికంగా వాడుకున్నాడని, ఆ తర్వాత మోసం చేశాడని ఆ యువతి చెప్పింది. అయితే సచిన్ మాత్రం ఆ లేడీ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాడు. ప్రత్యేక న్యామవాదిని అపాయింట్ చేసుకుని.. న్యాయ పోరాటం షురూ చేశాడు. ఇక .సచిన్ -జిగర్ సంగీత ద్వయానికి బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. ఇటీవల కాలంలో వీరు ‘స్త్రీ 2’, ‘బేడియా’, ‘థామ’, జాన్వి ‘పరం సుందరి’ తదిరత సూపర్ హిట్ చిత్రాలకు కలిసి పనిచేశారు. సూపర్ హిట్ పాటలను అందించారు. సచిన్ మొదట్లో ప్రీతమ్‌కు సహాయకుడిగా పనిచేశారు. తరువాత కొన్ని సినిమాలకు పాటలు కూడా పాడారు. తరువాత, జిగర్‌తో కలిసి సంగీత దర్శకత్వం వహించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: మాటల్లేవ్‌ అంతే..! ‘కాంతార’పై బన్నీ మాస్‌ రివ్యూ

‘ఫౌజీ’ టైటిల్‌లో సంస్కృత శ్లోకాలు.. వాటి అర్థం ఏంటంటే

చనిపోయాడని నదిలో నిమజ్జనం.. 13 ఏళ్ల తర్వాత ఇంటికి.. ఏం జరిగింది

డీమ్యాట్ ఖాతాలో రూ. 2,817 కోట్ల సంపద.. కాసేపటికే అంకెలన్నీ మాయమై

చదువుకునే రోజుల్లో ఎన్టీఆర్‌ గది ఇదే.. నెట్టింట ఫుల్ ట్రెండ్