సైఫ్ హాస్పిటల్ బిల్ వైరల్.. ఎన్ని లక్షలు ఖర్చు చేశారంటే ??

Updated on: Jan 22, 2025 | 5:27 PM

నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. దొంగతనానికి వచ్చిన ఓ దుండగుడు సైఫ్ పై కత్తితో దాడి చేశాడు. సైఫ్ ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ దొంగ సైఫ్ ఇంట్లోకి చొరబడి డబ్బు డిమాండ్ చేసి అతని పై దాడి చేశాడు. సైఫ్ అలీ ఖాన్ వీపుపై తీవ్ర గాయాలు కావడంతో ఆయనను హాస్పటల్ లో చేర్పించారు.

ప్రస్తుతం సైఫ్ సేఫ్ గా ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా సైఫ్ హాస్పటల్ బిల్లు ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. జనవరి 16న సైఫ్ అలీఖాన్ ఆసుపత్రిలో చేరారు. ఇంట్లో కాస్ట్లీ కార్లు ఉన్నా కూడా సైఫ్ ను అతని కుమారుడు ఇబ్రహీం ఆటోలో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత డాక్టర్‌ సైఫ్ కు ఆపరేషన్‌ చేశారు. సైఫ్ వెన్ను నుంచి కత్తిని తొలగించారు వైద్యులు.కాగా సైఫ్ అలీఖాన్ ఆసుపత్రి బిల్లు రూ.35.95 లక్షలు అని తెలుస్తుంది. దానిలో బీమా కంపెనీ నుంచి రూ.25 లక్షలు అందినట్లు సమాచారం. సైఫ్‌పై ఆరు సార్లు కత్తితో దాడి చేశాడు దుండగుడు. చికిత్స అనంతరం సైఫ్ కోలుకున్నారు. ఇక ఇప్పుడు సైఫ్ హాస్పటల్ బిల్లుకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సైఫ్ హాస్పిటల్ బిల్లు రూ.35.91 లక్షలు. అందులో రూ. 25 లక్షలకు బీమా కంపెనీ ఆమోదం తెలిపినట్లు అందులో ఉంది. దీంతోపాటు జనవరి 21న డిశ్చార్జి కానున్నట్లు కూడా పేర్కొన్నారు. అయితే అది ఆసుపత్రి బిల్లు కాదా అనేది ఖచ్చితంగా తెలియడం లేదు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రెండు కేజీల నువ్వుల నూనెను గటగటా తాగేసింది!

ఓరి దేవుడో.. ఇదేం వెరైటీ ఫుడ్‌! కోక్‌ తో ఆమ్లెట్టా ?? ఎలా చేశాడంటే..

ఆ హీరోను ప్రేమించి.. కెరీర్ పాడు చేసుకున్న హీరోయిన్..

Published on: Jan 20, 2025 05:23 PM