హీరో కాదు.. పక్కా బిజినెస్ మ్యాన్ !! 500 కోట్ల ఆస్తులంటే మాటలు కాదుగా…
బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల్లో అజయ్ దేవగన్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హిందీలోనే కాకుండా సౌత్‌లోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. తన సినిమాల ద్వారా రెండు చేతులా సంపాదిస్తూ.. కోట్లలో ఆస్తులను కూడబెట్టారు ఈ స్టార్ హీరో.
ఇక బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం.. అజయ్ దేవగన్ మొత్తం ఆస్తులు దాదాపు 427 కోట్ల రూపాయలు. ఎన్నో సంవత్సరాలుగా సినీరంగంలో చురుగ్గా ఉంటున్నాడు. అటు సినిమాలు, ప్రకటనలు, నిర్మాణ సంస్థ ద్వారా భారీగా సంపాదిస్తున్నారు. అనేక సూపర్ హిట్ చిత్రాలను నిర్మించాడు. ముంబైలోని జూహు ఏరియాలో 60 కోట్ల విలువ చేసే లగ్జరీ ఇంటని కట్టుకున్నాడు. శివ శక్తిగా ఆ ఇంటికి నామకరణం చేసిన ఈ స్టార్ అక్కడే తన ఫ్యామిలీతో నివాసం ఉంటున్నారు. ఇక ఈ స్టార్ హీరో.. 2000 సంవత్సరంలో ‘దేవ్గన్ ఫిల్మ్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. , అతనికి ఒక VFX కంపెనీ కూడా ఉంది. అజయ్ ‘NY సినిమాస్’ అనే మల్టీప్లెక్స్ చైన్‌ను కూడా ప్రారంభించాడు. అజయ్ దేవగన్ సినిమాల్లోనే కాదు, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉన్నారు. 2010లో, అజయ్ దేవగన్ రియల్ ఎస్టేట్ అండ్ కంస్ట్రక్షన్ వ్యాపారాన్ని ప్రారంభించారు. సంపాదనతో పాటే.. సమాజ సేవ కోసం.. NY అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించాడు అజయ్.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: ప్రైవేట్ దావత్‌లో రామ్ చరణ్.. వైరల్ వీడియో
ఆదిత్య 369 రీ రిలీజ్.. ఫస్ట్ ఛాయిస్ మోహిని కాదట..!
Allu Arjun: పరిస్థితుల ఎఫెక్ట్.. పేరు మార్చుకుంటున్న అల్లు అర్జున్
ఓర్నీ.. కుర్రాళ్లు సల్లగుండా.. చీట్ చేసి అలా ఎలా ఎస్కేప్ అయ్యరురా బాబు..