తనూజ, దివ్య మధ్య పోరుతో భరణి బేజారు
బిగ్ బాస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన భరణి పరిస్థితి మళ్లీ మునపటిలాగే తయారైంది. తనూజ, దివ్య మధ్య భరణి ఇరుక్కుపోయాడు. టాస్కులు, నామినేషన్స్.. ఇలా ప్రతి చిన్న విషయంలో భరణి కోసం కొట్టుకుంటున్నారు దివ్య, తనూజ. ఒకరితో మాట్లాడితే మరొకరు అలగడం.. చివరకు భరణి బుజ్జగించడం ఇదే పరిస్థితి ఆయనది.
బిగ్ బాస్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన భరణి పరిస్థితి మళ్లీ మునపటిలాగే తయారైంది. తనూజ, దివ్య మధ్య భరణి ఇరుక్కుపోయాడు. టాస్కులు, నామినేషన్స్.. ఇలా ప్రతి చిన్న విషయంలో భరణి కోసం కొట్టుకుంటున్నారు దివ్య, తనూజ. ఒకరితో మాట్లాడితే మరొకరు అలగడం.. చివరకు భరణి బుజ్జగించడం ఇదే పరిస్థితి ఆయనది. ఇక నిన్నటి అంటే 62వ ఎపిసోడ్ లోనూ భరణి కోసం దివ్య, తనూజ మధ్య బీభత్సమైన వార్ జరిగింది. దీంతో వెక్కి వెక్కి ఏడ్చేసింది తనూజ. అసలేం జరిగిందంటే.. బిగ్‌బాస్ హౌస్‌కి కొత్త కెప్టెన్‌ని డిసైడ్ చేసేందుకు పెట్టిన టాస్కులో చివరిగా రీతూ, తనూజ, ఇమ్మూ మిగిలారు. ఆ సమయంలో కెప్టెన్ దివ్య డెసిషన్ తీసుకోవాల్సి రావడంతో ఆమె తనూజ పేరు చెప్పింది. ఇమ్మూ కెప్టెన్ కావాలంటే తనూజ ఉండకూడదంటూ రీజన్ చెప్పింది. దీంతో తనూజ సీరియస్ అయ్యింది. పర్సనల్ రీజన్స్ తీసుకువచ్చి కెప్టెన్సీ టాస్కులో నన్ను తీసేస్తావా..? అంటూ దివ్యని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే కళ్యాణ్ కూడా తనూజకు పాయింట్ ఇచ్చేలా మాట్లాడడంతో.. తనూజ మరింతగా రెచ్చిపోయింది. పర్సనల్ రీజన్ కారణంగానే తనను దివ్య తీసేసిందని.. పర్సనల్స్ ఏమన్నా ఉంటే హౌస్ బయట చూసుకోవాలే కానీ.. ఇక్కడ ఎందుకంటూ గట్టిగా గట్టిగా అరుస్తూ దివ్యతో వాదించింది. ఆడియన్స్ అన్నీ చూస్తున్నారు అంటూ లోపలికి ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది తనూజ.ఈ క్రమంలోనే తనూజను ఓదార్చేందుకు లోపలికి వెళుతున్న భరణిపై దివ్య ఫైర్ అయ్యింది. విన్నారా భరణి గారు.. ఇప్పడు మీకు సంతోషమే కదా అంటూ సెటైర్ వేసింది. దీంతో భరణి ముఖంలో ఒక్కసారిగా తీవ్ర అసహనం కనిపించింది. దాంతో పాటే టాస్కు మధ్యలో పర్సనల్ రీజన్స్ నువ్వు తెస్తున్నావ్ అనే డైలాగ్ కూడా భరణి నోటి నుంచి బయటికి వచ్చింది. ఇక అప్పటికే బెడ్ రూమ్‌లో ఏడుస్తున్న తనూజ దగ్గరికి వెళ్లిన భరణి..ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. దీంతో తనూజ మళ్లీ సీరియల్ రేంజ్‌లో భరణికి డైలాగ్స్ అప్పజెప్పడం మొదలుపెట్టింది. నేను మీ గురించి బ్యాడ్ చెప్పానా.. మీ బ్యాడ్ కోరుకున్నానా.. అంటూ తనూజ కన్నీళ్లు పెట్టేకుంటూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇక నేను నీతో మాట్లాడను.. నిన్ను ఎవరూ టార్గెట్ చేయరులే అని భరణి అనడంతో.. తనూజ క కూడా నాతో ఎప్పుడూ మాట్లాడొద్దు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది తనూజ. తర్వాత ఒంటరిగా కూర్చున్న భరణి వద్దకు వెళ్లి మాట్లాడేందుకు ట్రై చేసింది దివ్య… అయితే అప్పటికే దివ్య మీద చాలా కోపంగా ఉన్న భరణి.. ఏం మాట్లాడతావ్ చెప్పు అంటూ గట్టిగా అరిచాడు. అరిచినందుకు సారీ చెబుదామని వచ్చాను అని దివ్య అనడంతో.. ఫస్ట్ టైమా నువ్వు అరిచింది అంటూ భరణి అసహనం వ్యక్తం చేశాడు. నువ్వు పాయింటి రెయిజ్ చేస్తావ్ తనేదో మాట్లాడతది.. నేనెందుకు స్టాండ్ తీసుకోవాలి అంటూ భరణి సీరియస్‌గా దివ్యపై అరుస్తాడు. దీంతో దివ్య అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇలా మొత్తానికి దివ్య , తనూజ ఇద్దరి మధ్య మొదలైన యుద్ధం కాస్తా భరణి మెడకు చుట్టుకుంది. దీంతో ఆయన పరిస్థితి ఎలిమినేషన్ ముందులాగే తయారైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: ఆ ప్రాజెక్ట్ సెట్టు అయితే అందనంత ఎత్తుకు అల్లు అర్జున్
రీసెంట్ టైమ్స్‌లో బాగా భయపెట్టే సినిమా ఇదే! హిట్టా..? ఫట్టా..?
రాజ్ నిడిమోరుకు సమంత క్లోజ్ హగ్ కొత్త ప్రయాణం మొదలైందా
ఇండియాలో అదరగొడుతున్న ‘ప్రెడెటర్ బ్యాడ్ ల్యాండ్స్
ఆ ఒక్క సీరియల్‌కే కోటికి పైగా సంపాదన హాట్ టాపిక్‌గా వంటలక్క ఫీజ్
