అతను జర్నలిస్టు కాదు..! సీరియస్ కామెంట్స్ చేసిన హీరోయిన్
"అదర్స్" సినిమా ప్రమోషన్స్‌లో గౌరీ కిషన్‌ను ఓ రిపోర్టర్ బాడీ షేమింగ్ చేశారు. పొట్టిగా, లావుగా ఉన్నావంటూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడంతో గౌరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్‌లో జరిగిన ఈ రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అయింది. సదరు జర్నలిస్ట్ రౌడీయిజంలా వ్యవహరించారని గౌరీ లేఖ విడుదల చేశారు. చిన్మయి శ్రీపాద వంటి నటీమణులు ఆమెకు మద్దతు పలికారు.
96 సినిమాతో తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది గౌరీ కిషన్. అలాగే జాను మూవీతో తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరయ్యింది. ఇప్పుడు ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా గౌరీ కిషన్… అదర్స్ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఓ రిపోర్టర్ ఆమె గురించి కామెంట్లు చేశారు. హీరోతో పోలిస్తే హీరోయిన్ చాలా పొట్టిగా, లావుగా ఉందంటూ ప్రశ్నించాడు. ఆమె బరువు ఎంత అని అడగడమే కాదు మిస్ కాస్టింగ్ జరిగిందంటూ కామెంట్ చేయడంతో గౌరీ ఆగ్రహంతో ఊగిపోయారు. బాడీషేమింగ్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. రిపోర్టర్ ప్రశ్నలకు ధీటుగానే బదులిచ్చింది గౌరీ. దీంతో ప్రెస్ మీట్ లో గందరగోళం నెలకొంది. ఈ సంఘటన కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఈ ఇష్యూపై రియాక్టైంది గౌరీ కిషన్. తాజాగా రిపోర్టర్‌తో గొడవపై స్పందిస్తూ ఓ లెటర్‌ను రిలీజ్ చేసిన గౌరీ కిషన్.. అందులో సదరు జర్నలిస్టు కావాలనే తనపై కామెంట్లు చేశారంటూ ఆరోపించారు. సదరు జర్నలిస్టు ప్రవర్తన రౌడీయిజంలా అనిపించిందని చెప్పారు. ఓ అమ్మాయి ఇలాంటి ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం ఎంత కష్టమో తెలుసా అని ప్రశ్నించారు. అంతేకాదు ఈ విషయంలో తనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు గౌరీ కిషన్. ఇక గౌరీ రియాక్టైన తీరును కోలీవుడ్‌లో చాలా మంది నటీమణులు మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్టార్ సింగర్ చిన్మయి అయితే.. సదరు జర్నలిస్టుతో గౌరీ కిషన్ పోరాడిన తీరు చాలా నచ్చిందంటూ చెప్పారు. ఇలాంటి ప్రశ్నలు హీరోలను అడగడానికి చేతకాదు కాని.. హీరోయిన్లనే ఎందుకు అడుగుతారని చిన్మాయి ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తనూజ, దివ్య మధ్య పోరుతో భరణి బేజారు
TOP 9 ET News: ఆ ప్రాజెక్ట్ సెట్టు అయితే అందనంత ఎత్తుకు అల్లు అర్జున్
రీసెంట్ టైమ్స్‌లో బాగా భయపెట్టే సినిమా ఇదే! హిట్టా..? ఫట్టా..?
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

