నన్ను టెర్రరిస్ట్ అంటావా ?? అన్వేష్‌కి ఇచ్చిపడేసిన సోహైల్

Updated on: May 05, 2025 | 7:16 PM

బిగ్ బాస్ రియాలిటీ షో తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సయ్యద్ సొహైల్ ఒకడు. నాలుగో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న అతను తన ఆట, మాట తీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగానూ పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. టీవీ షోల్లోనూ మెరుస్తున్నాడు. అయితే తాజాగా సొహైల్ తో పాటు మరికొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్లను ఉగ్రవాదులతో పోల్చుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్‌ నా అన్వేషణ.

ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన వారందరినీ టెర్రరిస్టులుగా పేర్కొన్నాడు. దీనిపై సొహైల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘బెట్టింగ్‌ యాప్స్‌ గురించి నన్ను తిట్టు.. అంతే కానీ ఉగ్రవాది అని ముద్ర వేయడమేంటి?’ అని అన్వేష్ కు కౌంటర్ ఇచ్చాడు. ‘కశ్మీర్‌లోని పహల్గామ్ లో ఉగ్రదాడికి పాల్పడ్డవాడు ఎక్కడికో పారిపోయాడు. వాడిని పట్టుకోవడం మానేసి మన ఇంట్లో మనం కొట్టుకుచస్తున్నాం. ఎక్కడో జరిగిన సంఘటనకు నన్ను ఉగ్రవాదిగా చిత్రీకరించడమేంటి? బెట్టింగ్‌ యాప్స్‌ గురించి నన్ను తిట్టు.. అంతేకానీ ఉగ్రవాది అని ముద్ర వేయడమేంటి? వాడెవడో చెప్పినంత మాత్రాన నేను ఉగ్రవాదిని అయిపోను. నేను భారతీయుడిని. చిన్నప్పటి నుంచి కులమత బేధాలు లేకుండా పెరిగాను. నేను శివుడికి పాలాభిషేకం చేశాను. సంక్రాంతికి మా ఇంట్లో అప్పాలు చేసుకుంటాం. రంజాన్‌ ఉంటే హిందూ స్నేహితులు నాతో పాటు నమాజ్‌ చదువుతాం. క్రిస్టియన్‌ ఫ్రెండ్సతో కలిసి చర్చికి వెళతాం. పక్కింటి వారితో కలిసి కొండగట్టుకు వెళ్లిన రోజులున్నాయి. అలాంటి వాతావరణంలో పెరిగిన ముస్లింలలో నేనూ ఒకరిని. ఒక భారతీయుడివై ఉండి నన్ను ఉగ్రవాది అంటున్నావ్‌. నిజమైన ఉగ్రవాదుల గురించి మాట్లాడకుండా.. వాళ్ల మీద కోపం చూపించకుండా మనలో మనం కొట్టుకుంటున్నాం. ఈ లెక్కన ఉగ్రదాడికి పాల్పడ్డ వారి ప్లాన్‌ బాగా సక్సెస్‌ అయినట్లే. అంటే ఇండియన్ గా నువ్వు ఫెయిల్‌ అయినట్లే” అంటూ అన్వేష్‌కు ఇచ్చిపడేశాడు సోహైల్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోర్టుతో ఆటలాడితే.. చిప్పకూడు తినాల్సిందే..

షాకింగ్ న్యూస్! కోహ్లీ బయోపిక్‌లో చరణ్‌ కాదు శింబు నటిస్తున్నాడు?

ఛీ వీడు మనిషి కాదు! సెల్ఫీ పేరుతో హీరోయిన్‌ను అసభ్యంగా తాకిన ఫ్యాన్

పాపం !! కోహ్లీ ప్రేమకు భారీ మూల్యమే చెల్లించిన అనుష్క

మంచి మనసు చాటుకున్న విష్ణు.. మధుసూదన్ కుటుంబాన్ని దత్తత తీసుకున్న హీరో!