Nikhil Maliyakkal: గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
బిగ్ బాస్ హౌస్ లో చాలా సెన్సిటివ్ పర్సన్ నిఖిల్. ఇతరులు హర్ట్ అవుతారేమో అనుకుని మాట్లాడిన మాటలే తనకు రివర్స్ అయ్యాయి. సీరియల్ నటి కావ్యతో కొన్నాళ్లు ప్రేమలో ఉన్నాడు నిఖిల్. కానీ హౌస్ లో తన పేరు చెప్పకుండానే తన లవ్ స్టోరీ చెప్పి అడియన్స్ అందరినీ కన్నీళ్లు పెట్టించాడు. షో అవ్వగానే తన దగ్గరికి వెళ్లిపోతాను.. తిడితే పడతాను.. కొట్టినా సరే తనే నా భార్య అంటూ ఎమోషనల్ డైలాగ్స్ తో గొప్ప ప్రేమికుడు అనిపించుకున్నాడు.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడే తెలిసింది తనే తన భార్య అని. ఆమెను ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్ని బ్రేకప్స్ మర్చిపోయేలా ఆమె చేసింది అంటూ.. బిగ్ బాస్ హౌస్‌లో తన ప్రేమ గురించి ఓ టాస్క్‌లో భాగంగా చెప్పడం మొదలెట్టిన నిఖిల్… తనకు తన అమ్మ ఎలాగో తన గర్ల్ ఫ్రెండ్ కూడా అలాగే అంటూ చెప్పాడు. తనని వదిలేయలేదు. ఈ షో తర్వాత తన దగ్గరకు వెళ్లిపోతాను. ఏడ్చినా, కోప్పడినా మళ్లీ వెళ్తా. పిచ్చిలేస్తే లేపుకుపోతా.. ఐయామ్ సారీ. ఈ షో నుంచి బయటకువచ్చిన మరుక్షణమే తన ముందు నిలబడతా.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు నిఖిల్.
కానీ ఇప్పుడు మాట మార్చేశాడు. బిగ్‌బాస్ సీజన్ 8 విజేతగా నిలిచిన నిఖిల్.. ఆ తర్వాత బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్నాడు. టైటిల్ గెలిచారు.. మరీ తన దగ్గరకు వెళ్తానని చెప్పారు. మరి వెళ్తారా ? అని యాంకర్ అర్జున్ అంబటి అడగ్గా.. షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు నిఖిల్. షో పూర్తికాగానే తన దగ్గరికే వెళ్తానని చెప్పాను. కానీ ఇప్పుడు బయట పరిస్థితి ఎలా ఉందో తెలియదు. అంటూ ఆన్సర్ ఇచ్చాడు. తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈ విన్నర్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.