Bigg Boss Madhuri: మాధురి రెమ్యూనరేషన్ ఎంతంటే ??
బుల్లితెరపై టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 9 విజయవంతంగా ప్రసారమవుతుంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షోలో ఆ తర్వాత ఆరుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్స్ గా ఎంట్రీ ఇవ్వడంతో రసవత్తరంగా మారింది. ఈక్రమంలో వైల్డ్ కార్డ్స్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ జరిగింది. దివ్వెల మాధురికి ఈ వారం తక్కువ ఓట్లు రావడమతో.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది.
వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన మాధురి మొదటి రోజునే పెద్ద రచ్చ చేసింది. ఆ తర్వాత తన మాట తీరు మార్చుకోవాలని నాగార్జున హెచ్చరించడంతో తన ఆట తీరు మార్చేసింది. మొదట్లో గొడవలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న మాధురి.. ఆ తర్వాత తన ఆట, మాట తీరుతో జనాలకు దగ్గరయ్యింది. అదేసమయంలో ఊహించని విధంగా హౌస్‌కు వెళ్లిన మూడు వారాల్లోనే బయటికి వచ్చేసింది. అయితే దాదాపు 3 వారాలు ఇంట్లో ఉన్న మాధురి వారానికి నలబై వేల చొప్పున.. మూడు వారాలకు గాను.. సుమారు లక్ష 20 వేల రూపాయలు అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వారం గౌరవ్, మాధురి డేంజర్ జోన్ ఉండగా.. గౌరవ్ ఎలిమినేట్ అవుతారని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా మాధురి ఎలిమినేట్ అయ్యింది. బయటకు వచ్చిన తర్వాత తన బిగ్ బాస్ జర్నీ AV చూసి మాధురి ఎమోషనల్ అయ్యింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Chinmayi Vs Jani Master: జానీ మాస్టర్‌కు ఛాన్స్ అంటే.. లైంగిక వేధింపులను లైసెన్స్ ఇచ్చినట్లే
Allu Arjun: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్‌పై అల్లు అర్జున్ ఎమోషనల్
Allu Sirish: నితిన్ భార్య వల్లే.. ప్రేమలో పడ్డా.. లవ్‌స్టోరీ వివరించిన అల్లు వారబ్బాయి
Bigg Boss 9: తనూజ గుట్టు రట్టు చేశా…అందుకే కక్ష కట్టి బయటికి పంపేశాడు
