పవన్ కళ్యాణ్ ప్లాన్ C.. ఫ్యూచర్ అదే..

ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలపై కొత్త ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. నటుడిగా, రాజకీయ నాయకుడిగా బిజీగా ఉండే జనసేనాని, ఇకపై నిర్మాతగానూ కొనసాగనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై సినిమాలు నిర్మించనున్నారు. ఇది ఆయన ప్లాన్ C గా అధికారికంగా ప్రకటించబడింది.

Updated on: Jan 17, 2026 | 1:52 PM

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తదుపరి ప్రణాళికలు ఏమిటనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కొత్త సినిమాలు ఒప్పుకుంటారా లేక ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి చేసి విరామం తీసుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, పవన్ కళ్యాణ్ తన ప్లాన్ Cని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.ఓజీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాల పట్ల వైఖరి మారింది. అంతకుముందు పెద్దగా ఆసక్తి చూపకపోయినా, ఓజీకి లభించిన స్పందనతో సీక్వెల్, ప్రీక్వెల్ చేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం హరీష్ శంకర్‌తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణలో ఆయన భాగం పూర్తయింది. ఈ చిత్రం 2024 సమ్మర్‌లో విడుదల కానుంది. ఉస్తాద్ తర్వాత హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా బిజీ కావాలని పవన్ కళ్యాణ్ యోచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

బలగం వేణు రెండో సినిమాపై క్లారిటీ వీడియో

ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?

యాభై ఏళ్లుగా నిద్రపోని వింత వ్యక్తి.. డాక్లర్లే పరేషాన్‌!

సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్