Balakrishna fans: ప్రమాదాన్ని గుర్తించిన పైలెట్‌కు బాలయ్య ఫ్యాన్స్ జేజేలు.. వైరల్ అవుతున్న వీడియో.
బాలయ్యకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతిక లోపంతో ఒంగోలుకే తిరిగి వెళ్లిపోయింది. ఉదయం ఒంగోలు నుంచి హైదరాబాద్
బాలయ్యకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతిక లోపంతో ఒంగోలుకే తిరిగి వెళ్లిపోయింది. ఉదయం ఒంగోలు నుంచి హైదరాబాద్ బయల్దేరిన బాలయ్య హెలికాప్టర్‌లో కాసేపటికే సాంకేతిక లోపాన్ని గుర్తించిన ఫైలట్.. తిరిగి మళ్లీ ఒంగోలులో సేఫ్ ల్యాండ్ చేశాడు.ఇక ఈ ఇన్‌సిండెంట్ తాలూకు న్యూస్ అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవ్వడంతో.. బాలయ్య ఫ్యాన్స్ ఒక్క సారిగా షాకయ్యారు. బాలయ్య సేఫ్గా ఉండాలని ప్రార్థించారు. ఒంగోలు చుట్టుపక్కల ఉన్నవారు.. ఆయన స్టేయింగ్ చుట్టుపక్కల చేరుకున్నారు. పైలెట్ తీసుకున్న నిర్ణియాన్ని సమర్థిస్తూ.. జేజేలు కొట్టారు. బాలయ్య లాంగ్ లివ్ అంటూ నినాదాలు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jan 07, 2023 09:19 PM