Bhagavath Kesari: బాలయ్య భగవంత్ కేసరి హిట్టా..? ఫట్టా..? ఫన్ డైరెక్టర్ మాస్ స్ట్రైక్ ఇచ్చాడా..?

Bhagavath Kesari: బాలయ్య భగవంత్ కేసరి హిట్టా..? ఫట్టా..? ఫన్ డైరెక్టర్ మాస్ స్ట్రైక్ ఇచ్చాడా..?

Anil kumar poka

|

Updated on: Oct 19, 2023 | 6:20 PM

ఆఫర్ట్ వీర సింహా రెడ్డి.. బాలయ్య చేస్తున్న మరో రోరింగ్ ఫిల్మ్ భగవంత్‌ కేసరి. అసలు ప్లాపే లేని ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. తెరకెక్కిన ఈసినిమా తాజాగా రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. ఎప్పటిలాగే.. బాలయ్య మార్క్‌ సినిమాలా.. బాక్సులు బద్దలయ్యేలా ఉందా..? అనేది తెలియాలంటే.. జస్ట్ వాచ్ దిస్ రివ్యూ..! భగవంత్ కేసరి అలియాస్ బాలకృష్ణ.. అదిలాబాద్ జిల్లాలోని ఒక అడవిలో ఉంటాడు.

ఆఫర్ట్ వీర సింహా రెడ్డి.. బాలయ్య చేస్తున్న మరో రోరింగ్ ఫిల్మ్ భగవంత్‌ కేసరి. అసలు ప్లాపే లేని ఫన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. తెరకెక్కిన ఈసినిమా తాజాగా రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. ఎప్పటిలాగే.. బాలయ్య మార్క్‌ సినిమాలా.. బాక్సులు బద్దలయ్యేలా ఉందా..? అనేది తెలియాలంటే.. జస్ట్ వాచ్ దిస్ రివ్యూ..! భగవంత్ కేసరి అలియాస్ బాలకృష్ణ.. అదిలాబాద్ జిల్లాలోని ఒక అడవిలో ఉంటాడు. అనుకోని పరిస్థితుల్లో జైలుకు వెళ్తాడు అక్కడ జైలర్ అలియాస్ శరత్ కుమార్ కూతురు విజ్జి అలియాస్ శ్రీలీల బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ప్రతి చిన్న విషయానికి భయపడే అమ్మాయిని కేసరి ఒక పులిలా ఎలా మార్చాడు అనేది ఈ సినిమా కథ. ఈ కథలోకి మధ్యలో రాహుల్ సంఘ్వి అలియాస్ అర్జున్ రాంపాల్ ఎలా వచ్చాడు.. ఆయనకు భగవంత్ కేసరికి సంబంధం ఏంటి.. మధ్యలో కాత్యాయని అలియాస్ కాజల్ అగర్వాల్ ఎక్కడి నుంచి వచ్చింది.. అనేది మిగిలిన కథ ప్రమోషన్స్‌లో చెప్పినట్టుగానే.. బాలయ్యను నెవర్ బిఫోర్ కారెక్టర్‌లో చూపించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఆయన కారెక్టరైజేషన్ సినిమాకు హైలైట్. దానిపై చాలా శ్రద్ధ కూడా పెట్టారు. రెగ్యులర్ బాలయ్య సినిమాల కాకుండా కొత్తగా చూపించే ప్రయత్నం అయితే చేసారు. డైలాగ్ డెలవరీ దగ్గర్నుంచి.. గెటప్ వరకు.. ప్రతీ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు అనిల్. అందులో సక్సెస్ అయ్యాడు కూడా.

సింపుల్ గా చెప్పాలంటే తనది కానీ గ్రౌండ్ లోకి వెళ్లి ఆట ఆడాడు అనిల్. అందులో కొన్ని బాల్స్ బౌండరీ దాటితే.. మరికొన్ని క్యాచ్ అవుట్ అయ్యాయి. సినిమా ఎలా ఉంది అనే విషయం పక్కన పెడితే ఇందులో నచ్చింది ఒక్కటే.. అదే అనిల్ రావిపూడి టేకింగ్. అనుకున్నది అనుకున్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ గా చూపించారు. కమర్షియల్ హంగులు అంటూ అనవసరంగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా తీశారు. తను రాసుకున్న కథలోనే బాలయ్య ఇమేజ్ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఫస్టాఫ్ బాగుంది. వార్నింగ్ సీన్ భాషాను గుర్తు చేస్తుంది. కొన్ని సీన్స్ భీమ్లా నాయక్ ను గుర్తు చేస్తాయి. సెకండాఫ్ పూర్తిగా యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు ఎమోషన్ పై ఫోకస్ చేశారు అనిల్. ఆడపిల్లలను పులి పిల్లల పెంచాలి అనేది ఈ సినిమాతో అనిల్ చెప్పాలనుకున్న లైన్. ఇక భగవంత్ కేసరి పాత్రకు బాలయ్య పూర్తి న్యాయం చేశాడు. ఆయన పాత్ర కోసమే పుట్టాడేమో అనిపించేలా నటించాడు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా కాసేపు కనిపించినా ఆకట్టుకుంది. శ్రీలీల మరో కీలక పాత్రలో మెప్పించింది. బాలయ్య కూతురుగా ప్రాణం పోసింది. ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా బాగా ఎమోషనల్‌గా వర్కవుట్ అయ్యాయి. సీనియర్ నటుడు శరత్ కుమార్, బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ తమ తమ పాత్రలకు న్యాయం చేసారు. వీరి యాక్టింగ్‌కు తోడు.. థమన్ సంగీతం బాగుంది. ఆర్ఆర్ అయితే అదిరిపోయింది. మెయిన్‌గా.. రోర్ ఆఫ్ భగవంత్ కేసరి పాట థియేటర్లో మార్మోగిపోతుంది. గూస్ బంప్స్ వచ్చేలా చేస్తుంది. ఇక ఓవర్‌ ఆల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే అక్కడక్కడా స్లో నెరేషన్ పక్కకు పెడితే.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే బాలయ్య మార్క్‌ రోరింగ్ సినిమా భగవంత్ కేసరి!

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..