Arvind Kejriwal: జైలు నుంచే తొలి ఆదేశాలు జారీ చేసిన కేజ్రీవాల్‌.!

Arvind Kejriwal: జైలు నుంచే తొలి ఆదేశాలు జారీ చేసిన కేజ్రీవాల్‌.!

Anil kumar poka

|

Updated on: Mar 25, 2024 | 8:40 AM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పాలన సాగిస్తారా..? లేదా..? అనే అంశంపై గందరగోళం నెలకొన్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఆదివారం జైలు నుంచే ఆయన పాలన ప్రారంభించినట్లు ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. ఈడీ కస్టడీ నుంచే ఆయన నేడు తొలిసారి ఢిల్లీకి మంచినీటి సరఫరా విషయంలో ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనిని ఓ నోట్‌ రూపంలో జలమంత్రిత్వశాఖను నిర్వహిస్తున్న ఆతిశీ మార్లీనాకు ఆయన పంపించారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పాలన సాగిస్తారా..? లేదా..? అనే అంశంపై గందరగోళం నెలకొన్న సమయంలో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఆదివారం జైలు నుంచే ఆయన పాలన ప్రారంభించినట్లు ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. ఈడీ కస్టడీ నుంచే ఆయన నేడు తొలిసారి ఢిల్లీకి మంచినీటి సరఫరా విషయంలో ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనిని ఓ నోట్‌ రూపంలో జలమంత్రిత్వశాఖను నిర్వహిస్తున్న ఆతిశీ మార్లీనాకు ఆయన పంపించారు. నేటి ఉదయం దీనిపై ఆమె విలేకర్లకు మరింత సమాచారం ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఈడీ అధికారులు జారీ చేసిన సమన్లకు స్పందించకపోవడంతో మార్చి 21వ తేదీన కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. మనీలాండరింగ్‌ చట్టం ఉల్లంఘన ఆరోపణలపై ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. తర్వాత కోర్టు ఆయన్ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి ఇచ్చింది. కానీ, ఆయన ఇప్పటి వరకు సీఎం పదవికి రాజీనామాను సమర్పించలేదు. లాకప్‌ నుంచే పాలన కొనసాగిస్తారని ఆప్‌ వర్గాలు బలంగా చెబుతున్నాయి. తాము అంతకు ముందే చెప్పామనీ కేజ్రీవాల్‌ ప్రభుత్వ పాలన కొనసాగిస్తారునీ జైలు నుంచి పాలించకుండా ఏ చట్టమూ అడ్డుకోలేదనీ మంత్రి ఆతిశీ మార్లీనా వెల్లడించారు. కేజ్రీవాల్‌ పై ఆరోపణలు రుజువుకాలేదనీ అందుకే ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగుతారనీ ఆమె అన్నారు. కేజ్రీవాల్‌ ఒకవేళ రాజీనామా ప్రకటిస్తే ఆయన పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే సీఎంగా ప్రభుత్వాన్ని నడపొచ్చని సీనియర్‌ బ్యూరోక్రాట్‌, ఢిల్లీ మాజీ చీఫ్‌ సెక్రటరీ ఉమేశ్‌ సైగల్‌ తెలిపారు. జైలు మాన్యువల్‌ కూడా ఒక వ్యక్తి కారాగారం లోపలి నుంచి ప్రభుత్వాన్ని నడపడానికి అనుమతించదని స్పష్టం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Published on: Mar 25, 2024 08:36 AM