Ghaati: ఘాటీతో.. క్రిష్, అనుష్క గట్టెక్కుతారా? హిట్టా..? ఫట్టా..?

Updated on: Sep 05, 2025 | 7:39 PM

బాహుబలి సినిమాతో... మరో రేంజ్‌కు వెళ్లిపోయిన అనుష్క.. చాలా రోజుల తర్వాత ఫిమేల్ సెంట్రిక్ సినిమా ఘాటీతో మన ముందుకు వస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు డైరెక్టర్. ఎన్నో అంచనాల మధ్య.. మరెన్నో వాయిదాల మధ్య ఎట్టకేలకు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది? అనుష్క మన పర్ఫార్మెన్స్‌ తో అందర్నీ మెప్పించిందా? లేదా? డైరెక్టర్ క్రిష్ ఈ సారైన ఓ సాలిడ్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా.. లేడా? తెలుసుకోవాలంటే.. వాచ్ దిస్ రివ్యూ..! ఘాటీ సినిమా కథ అంతా ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో జరుగుతూ ఉంటుంది.

అక్కడ తూర్పు కనుమల్లో ఉన్న గ్రామాల ప్రజలందరూ గంజాయి సాగు చేసి, వాటిని ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారు.అయితే ఇదంతా కాష్టాల నాయుడు అలియాస్ రవీంద్ర విజయ్, కుందుల నాయుడు అలియాస్ చైతన్య రావు ఆద్వర్యంలో జరుగుతుంటుంది. ఇక గంజాయినీ రవాణా చేసే ఘాటీలుగా దేశీ రాజు అలియాస్ విక్రమ్ ప్రభు, శీలావతి అలియాస్ అనుష్క వీళ్ల కిందే కొద్ది రోజులు పని చేస్తారు. ఆ తర్వాత వారు ఆ పని మానేసి వేరే పని చేస్తూ బతుకు సాగిస్తుంటారు. అయితే, వాళ్లు తిరిగి మళ్లీ గంజాయి స్మగ్లింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్మగ్లింగ్ మళ్లీ ఎందుకు చేయాల్సి వచ్చింది? జనజీవన స్రవంతిలోకి వెళ్లి సాధారణ జీవితం గడుపుతున్న ఘాటీలు మళ్లీ గంజాయి స్మగ్లింగ్‌లోకి ఎందుకు అడుగుపెట్టారు? ఈ క్రమంలోనే శీలవతి క్రిమినల్‌గా ఎలా మారాల్సి వచ్చింది? చివరికి లెజెండ్‌గా ఎలా అవతరించింది? అనేది ఈ సినిమా కథ. ఆఫ్టర్ పుష్ప మన టాలీవుడ్ మేకర్స్ అందరూ అడవుల బాట పట్టారు. అందులోనూ ఓ డార్క్‌ పాయింట్ నేపథ్యంగానే కథ అల్లుకుంటున్నారు. పుష్పలో.. స్మగ్లింగ్ కీ వాయింగ్ అయితే.. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాల్లో గంజాయి ఫామింగ్ కీ పాయింట్‌గా మారింది. ఇక సాయి ధరమ్‌ తేజు, సంపత్‌ నంది ఏకంగా గాంజా శంకర్ పేరుతో ఓ సినిమా కూడా అనౌన్స్ చేశారు అప్పట్లో..! కానీ తీవ్ర విమర్శల కారణంగా.. పోలీసుల నుంచి అభ్యంతరాల కారణంగా పక్కకుపెట్టేశారు.అయితే క్రిష్‌ మాత్రం ఇదే గంజాయి కాన్సెఫ్ట్ ను తీసుకుని.. చెడు నుంచి మంచికి తన సినిమా డ్రైవ్ చేసి.. బాక్సాఫీస్‌ వరకు వచ్చాడు. అంతేకాదు మనకు తెలియని ఘాటీ వర్గాన్ని.. వాళ్లు చేసే వృత్తిని.. ఆ వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను.. వాళ్ల వృత్తి కారణంగా.. సమాజంలో పెరుగుతున్న రుగ్మతను.. ఇది తెలిసి.. వాళ్లలో కలిగిన మార్పును.. కళ్లకు కట్టినట్టు సినిమాటిక్ లిబర్టీతో చూపించాడు డైరెక్టర్ క్రిష్. అయితే అందుకు శీలవతి అలియాస్ అనుష్క నేపథ్యంగానే కథ రాసుకున్నాడు. తన స్నేహితుడు, సీనియర్ జర్నలిస్ట్ గంజాయి స్మగ్లింగ్‌ మీద చేసిన రీసెర్చ్ ఆధారంగా క్రిష్ ఈ కథకు రూపానిచ్చాడు. ఇక ఈ సినిమా ఫస్టాఫ్ అంతా జన ఫస్ట్ హాఫ్ అంతా.. జనజీవన స్రవంతిలోకి వచ్చి సాధారణ పనులు చేసుకునే హీరో, హీరోయిన్లు మళ్లీ గంజాయి స్మగ్లింగ్ బారిన ఎందుకు పడ్డారు అనేది ఆసక్తికరంగా చూపించాడు డైరెక్టర్. ఆ తర్వాత విలన్ గ్యాంగ్‌తో మొదలైన వైరం ఎలాంటి పరిస్థితులకు దారితీసింది అనేది కూడా క్రిష్‌ గ్రిప్పింగ్‌ రాసుకున్నాడు. కథ పెద్దగా లేదు, కానీ కథనంతో నడిపించే ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యాడు క్రిష్. అయితే, హై మూమెంట్స్ చాలా ఉన్నా, కొన్ని బాగా వర్కవుట్ అయ్యాయి. ఆ మరికొన్ని కూడా వర్కౌట్ అయి ఉంటే సినిమా లెవెల్ వేరేలా ఉండేది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ మంచి ఫీల్ ఇచ్చినా, సెకండ్ హాఫ్ విషయంలో కొంత డిసప్పాయింట్‌మెంట్ అనిపిస్తుంది. అది ఎలానో తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.! ఇక అనుష్క స్వీటీ ఎప్పటిలాగే సూపర్ గా ఆకట్టుకుంది. ఎలాగూ క్రిష్ ఈమె సెంట్రిక్‌గానే కథ రాసుకున్నాడు కాబట్టీ… ఆయన రాతకు.. డైరెక్షన్కు తగ్గట్టే వన్ ఉమెన్‌ షో చేసింది స్వీటీ. డైలాగ్స తోనే కాదు.. ఫైట్స్‌లోనూ అదరగొట్టింది. ఆమెకు సపోర్ట్‌గా మరో లీడ్‌ చేసిన విక్రమ్‌ ప్రభు యాక్టింగ్ కూడా బాగుంది. జగపతి బాబు క్యారెక్టర్‌ కూడా తన క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. డైరెక్టర్‌ రాసుకున్నట్టు అద్భతుంగా యాక్ట్ చేశాడు. అండ్ వన్ ఆఫ్ ది కీ రోల్ ఈయనది! మిగిలిన వారు వారి వారి పరిధి మేర నటించారు. ఇక వీరికి తోడు సాగర్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ కంటే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరింత ఎఫెక్టివ్‌గా.. సినిమాను ఎలివేట్ చేశాలా ఇచ్చాడు సాగర్.సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సాయి మాదవ్ డైలాగ్స్ అదరిపోయాయి.అందులోనూ అనుష్క చెప్పే పంచ్‌ డైలాగులు అందరికీ చెవుల్లో మార్మోగిపోతుంటాయి. డైరెక్టర్ క్రిష్ కూడా ఎప్పటిలానే ఈ సారి కూడా ఎవ్వర్నీ డిస్సపాయింట్ చేయడు. మరో సారి తన డైరెక్షన్ స్కిల్స్‌తో ఆకట్టకుంటాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కపిల్ కామెడీ షో నుంచి ఆ నటుడు ఔట్.. ఫ్యాన్స్ నిరాశ

టీచర్స్ డే.. బడిలో ఏంటి మాస్టారూ ఈ పని

Balakrishna: నీ బిడ్డ పెళ్లికి వస్తాను.. ఎట్లా వస్తా.. ఏంటనేది చెప్పను!

New GST Rules: సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ 2.0.. ఇవన్నీ చవకే

హుస్సేన్ సాగర్‌లో ఖైరతాబాద్ బడా గణేశ్‌ నిమజ్జనం ఏర్పాట్లు షురూ