Tripti Dimri – Vijay Deverakonda: బంపర్ ఆఫర్.. ఇక మామూలుగా ఉండదు! రౌడీ బాయ్ తో యానిమల్ బేబీ.

|

Jan 21, 2024 | 1:59 PM

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తైయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా విజయ్ చేతిలో మరిన్ని సినిమాలు ఉన్నాయి. అందులో జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ రాబోతుంది.

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు. డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తైయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఫ్యామిలీ స్టార్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా విజయ్ చేతిలో మరిన్ని సినిమాలు ఉన్నాయి. అందులో జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్ రాబోతుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ చిత్రంలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. గతంలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా స్టార్ట్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీ గురించి నిత్యం ఏదోక వార్త నెట్టింట వైరలవుతుంది. అయితే వాటిపై చిత్రయూనిట్ ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా మరో న్యూస్ తెరపైకి వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా నుంచి శ్రీలీల తప్పుకుందని తెలుస్తోంది. డేట్స్ విషయంలో అడ్జస్ట్ కాకపోవడంతో శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని టాక్ వినిపిస్తుంది. నిజానికి ముందే ఈ మూవీ షూటింగ్ జరగాల్సింది . కానీ విజయ్ ముందు ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తుండడంతో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యింది. దీంతో అప్పటికే పలు చిత్రాలకు శ్రీలీల డేట్స్ ఇవ్వడంతో.. ఇప్పుడు విజయ్ సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తోంది. దీంతో ఈ బ్యూటీ ప్లేస్ లోకి బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకున్నారట. తను మరెవరో కాదు.. సూపర్ హిట్ యానిమల్ భామ త్రిప్తి దిమ్రి అని తెలుస్తోంది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఇందులో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాలో రష్మిక కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ మాత్రం త్రిప్తి దిమ్రి. ఈ మూవీతో ఈ హీరోయిన్ ఫాలోయింగ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటు తెలుగులో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు ఎక్కువే వస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Published on: Jan 21, 2024 01:50 PM