Anchor Suma: రిటైర్మెంట్ పై సుమ షాకింగ్ కామెంట్స్.. ఆ వర్గానికి స్ట్రాంగ్ కౌంటర్ కూడా

Updated on: Nov 21, 2025 | 1:22 PM

యాంకర్ సుమ తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తన వయసుపై, పనితీరుపై వస్తున్న విమర్శలకు ధీటుగా స్పందించారు. 50 ఏళ్లు వచ్చినా చురుకుగా ఉన్నానని, తమ కుటుంబ జన్యువులు బలమైనవని తెలిపారు. తన అమ్మమ్మ 101 ఏళ్లు బతికిందని ఉదహరిస్తూ, ఇప్పట్లో పదవీ విరమణ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆమె సేవలు కొనసాగుతాయని వెల్లడించారు.

స్పాంటేనియస్ మాటలతో… తన కామెడీ టైమింగ్‌తో .. పంచులతో.. ప్రతీ ఈవెంట్లో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారే యాంకర్ సుమ.. ఉన్నట్టుండి రిటైర్మెంట్‌ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పనిలో పనిగా.. ఓ వర్గం వారికి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దాదాపు 30 ఏళ్లకు పైగా టీవీ, సినిమా రంగంలో ఉంది సుమ. దాదాపు 20 ఏళ్లకు పైగా యాంకరింగ్ తో అందర్నీ అలరిస్తోంది. ప్రస్తుతం సుమకు 50 ఏళ్ళు. అయినా చాలా యంగ్ గా కనిపిస్తూ యాక్టివ్ గా వర్క్ చేస్తుంది. ఇటీవల కొంతమంది సుమకు ఏజ్ అయిపోతుంది, సుమ తర్వాత ఎవరు, సుమ ఎప్పుడు రిటైర్ అవుతుంది అని పలు కామెంట్స్ చేసారు. కొంతమంది యాంకర్స్ కూడా ఇండైరెక్ట్ గా సుమనే అన్ని కవర్ చేస్తుంది, తమకు ఏమి రావట్లేదు అని పలు సందర్భాలలో అన్నారు. ఇలాంటి వాటన్నిటికీ తాజాగా సుమ కౌంటర్ ఇచ్చింది. ప్రేమంటే సినిమాలో కీలక పాత్రలో నటించిన సుమ… ఈ ఈవెంట్లోనే తన రిటైర్మెంట్‌ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు ఇచ్చిపడేసింది. మా అమ్మకు 84 ఏళ్ళు. కానీ వెరీ యంగ్. ఆమెకే రిటైర్మెంట్ లేనప్పుడు నాకెందుకు ఉంటుంది. చాలా మంది నన్ను అడుగుతున్నారు మీరెప్పుడు రిటైర్ అవుతారు అని. నేనెందుకు రిటైర్ అవ్వాలి. మా ఫ్యామిలీ జెనెటిక్స్ వి చాలా స్ట్రాంగ్ జీన్స్. మా అమ్మమ్మ 101 ఏళ్ళు బతికింది. మా పెద్ద మామయ్యకు 99 ఏళ్ళు. ఇప్పటికి అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. గిన్నిస్ రికార్డ్ హోల్డర్. నన్ను ఎందుకు అడుగుతున్నారు రిటైర్మెంట్ గురించి. నేను ఇప్పట్లో రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు. నేను ఇలానే వర్క్ చేస్తూ ఉంటాను అంటూ చెప్పుకొచ్చారు సుమ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నవంబర్‌ మొత్తం.. చల్ల చల్లని కూల్‌కూల్‌

Sabarimala: భక్తుల రద్దీతో ట్రావెన్ కోర్ బోర్డు కీలక నిర్ణయం

Cyclone Alert: దూసుకొస్తున్న మరో తుఫాన్‌ వాతావరణశాఖ పిడుగులాంటి వార్త

శివయ్య కోసం వందల సంఖ్యలో తరలి వచ్చిన పాములు.. హర హర మహాదేవ..

బర్గర్ తిని వ్యక్తి మృతి.. ఏం తినాలన్న భామేస్తుందిరా అయ్యా..

Published on: Nov 21, 2025 01:22 PM