మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. మొక్కలు నాటితే అనసూయ సినిమా టికెట్లు ఫ్రీ..

టాలీవుడ్ బుల్లితెరపై స్టార్ యాంకర్ గా చెలామణీ అయిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు వెండితెరపై వెలిగిపోతోంది. వరుసగా సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఇక ఇప్పుడు ‘సింబా’ అంటూ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో మన ముందుకు వస్తోంది. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల పై సంపత్ నంది, దాసరి రాజేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముర‌ళీ మ‌నోహ‌ర్ దర్శకత్వం వహించారు.

మూవీ లవర్స్‌కు బంపరాఫర్.. మొక్కలు నాటితే అనసూయ సినిమా టికెట్లు ఫ్రీ..

|

Updated on: Aug 07, 2024 | 5:10 PM

టాలీవుడ్ బుల్లితెరపై స్టార్ యాంకర్ గా చెలామణీ అయిన అనసూయ భరద్వాజ్ ఇప్పుడు వెండితెరపై వెలిగిపోతోంది. వరుసగా సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఇక ఇప్పుడు ‘సింబా’ అంటూ మరో ఇంట్రెస్టింగ్ మూవీతో మన ముందుకు వస్తోంది. సంపత్ నంది టీం వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్ల పై సంపత్ నంది, దాసరి రాజేందర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముర‌ళీ మ‌నోహ‌ర్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 09న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన మేకర్స్ మూవీ లవర్స్ కు ఒక బంపరాఫర్ ప్రకటించారు. మొక్కలను నాటి సోషల్ మీడియాలో ఫొటోలు పంపితే.. ఈ సినిమా టికెట్లు ఉచితంగా ఇస్తానంటూ వెల్లడించారు. మొక్కలు నాటిన ఫొటోలు పంపిన వారందరికీ ఈ ఆఫర్ వర్తిసుందని స్పష్టం చేశారు. ఈ సినిమా నిర్మాత, ప్రముఖ దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ.. అసలు ఈ సినిమా ఎలా మొదలెపెట్టాల్సి వచ్చిందో చెప్పారు. “సింబా మూవీ ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఉదయ భాను. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌‌లో భాగంగా ఉదయభాను నన్ను ఛాలెంజ్ చేసింది. ఆ తరువాత సంతోష్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన హరితహారం గురించి తెలుసుకున్నా. అలాంటి టైంలోనే ఈ కథ విన్నాను. అందరికీ కనువిప్పు కలిగేలా, ఎంటర్టైన్ చేసేలా, మంచి సందేశం ఇచ్చేలా సింబా ఉంటుంది. ఈ చిత్రం ఆగస్ట్ 9న రాబోతోంది. ఏ ఒక్కర్నీ నిరాశపర్చదు. అందరినీ మెప్పిస్తుంది” అని చెప్పుకొచ్చారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇద్దరి మధ్యలోకి వెళ్లి.. గుక్కపెట్టి ఏడుస్తున్న శేఖర్ బాషా

మంజుమ్మల్‌ ప్రొడ్యూసర్ ముక్కుపిండి మరీ డబ్బు వసూలు చేసిన రాజా..

Explainer: రాణి లేని రాజ్యం కారణం.. చైనానా ?? అమెరికానా ??

TOP 9 ET News: దేవర సాంగ్‌ కాపీ అంటూ దారుణంగా ట్రోల్స్

iSmart News: పైకప్పుకు కన్నం పెట్టి వైన్ షాపులో లూఠీ !!

Follow us